News September 1, 2025
ఇందిరమ్మ చీరలు ఈసారైనా చేరేనా..?

తెలంగాణలో ఈసారి కూడా ఇందిరమ్మ చీరల పంపిణీ అనుమానమే. గతేడాది శారీలు ఇవ్వని సర్కారు ఈసారి మరింత క్వాలిటీతో మహిళా సంఘాల సభ్యులకు రెండు చీరలు అందిస్తామని ఇటీవలే చెప్పింది. సెప్టెంబర్ 21 – 30 మధ్య బతుకమ్మ వేడుకలు జరగనుండగా, సెప్టెంబర్ 30లోపు స్థానిక ఎన్నికలు నిర్వహించాలి. దీంతో ఇందుకు రెండు వారాల ముందే నోటిఫికేషన్, ఎన్నికల కోడ్ అమల్లోకి రావచ్చు. ఈ పరిణామాలను బట్టి ఈసారీ ఆడబిడ్డలకు చీరలు అందకపోవచ్చు.
Similar News
News September 7, 2025
ఐదేళ్లలో 50 వేల మందికి విదేశాల్లో ఉద్యోగాలు: మంత్రి లోకేశ్

AP: సీడాప్ ద్వారా వచ్చే ఐదేళ్లలో 50 వేల మందికి విదేశాల్లో ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్లు మంత్రి లోకేశ్ తెలిపారు. ఈ నెలలోనే నైపుణ్యం పోర్టల్‌ను ప్రారంభిస్తామన్నారు. అంతర్జాతీయ ప్లేస్ మెంట్ పథకం కింద జర్మనీ ఆసుపత్రుల్లో ఉద్యోగాలు పొందిన అభ్యర్థులను అభినందించారు. తొలి బ్యాచ్‌లో సీడాప్ ద్వారా మొత్తం 171 మందికి శిక్షణనివ్వగా, ఇప్పటికే వివిధ విభాగాల్లో 40 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారని తెలిపారు.
News September 7, 2025
రాబోయే 2 గంటల్లో వర్షం

TG: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రాబోయే 2 గంటల్లో వర్షం పడుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉమ్మడి ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హనుమకొండ, ఉమ్మడి కరీంనగర్, జనగాం, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, ఖమ్మం, ములుగు, నిజామాబాద్, సూర్యాపేట, వరంగల్ జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.
News September 7, 2025
భారీగా పెరిగిన బీసీసీఐ బ్యాంక్ బ్యాలన్స్!

BCCI (భారత క్రికెట్ బోర్డు) బ్యాంక్ నిల్వలు రూ.20,686 కోట్లకు చేరినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. గత ఐదేళ్లలో బోర్డు ఖజానాలో రూ.14,627 కోట్లు చేరాయని జాతీయ మీడియా పేర్కొంది. కేవలం గత ఆర్థిక సంవత్సరంలోనే రూ.4,193 కోట్లు పెరిగినట్లు తెలుస్తోంది. IPL, ICC డిస్ట్రిబ్యూషన్స్ ద్వారా భారీగా ఆర్జించినట్లు సమాచారం. ఈనెల 28న జరిగే యాన్యువల్ జనరల్ మీటింగ్‌లో ఈ వివరాలను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.