News September 1, 2025

వనపర్తి: మరమ్మతు పనులు పూర్తి చేయాలి: CM

image

ఇటీవల ఆయా జిల్లాలో కురిసిన భారీవర్షాల నేపథ్యంలో నష్టపోయిన వివిధ శాఖల పరిధిలోని మరమ్మతులను త్వరితగతిన పూర్తిచేయాలని సీఎం రేవంత్ రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. సోమవారం సెక్రటేరియట్ నుంచి కలెక్టర్లు, ఎస్పీలతో CM వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పాల్గొన్న కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ.. జిల్లాలో ఇరిగేషన్ శాఖకు సంబంధించి 25డ్యామేజీలు జరిగాయని, ఇప్పటివరకు ఆరింటికి మరమ్మతులు పూర్తి చేశామన్నారు.

Similar News

News September 7, 2025

నేడు ఈ జిల్లాల్లో వర్షాలు: APSDMA

image

AP: వాయవ్య బంగాళాఖాతం, ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో దక్షిణ ఒడిశా- ఉత్తరాంధ్ర తీరాల మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

News September 7, 2025

ఇండియా స్కిల్స్‌ కాంపిటీషన్‌–2025 పోస్టర్లను ఆవిష్కరించిన కలెక్టర్ ఇండియా

image

ఇండియా స్కిల్స్‌ కాంపిటీషన్‌–2025 పోస్టర్లను కలెక్టర్ ఆనంద్ కలెక్టరేట్లోని తన ఛాంబర్లో ఆవిష్కరించారు. పోటీల్లో పాల్గొనడానికి 16-25 ఏళ్ల యువత అర్హులన్నారు. ఈనెల 30లోపు ఈకేవైసీ ధ్రువీకరణ సహా రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉందన్నారు. స్కిల్ ఇండియా డిజిటల్ హబ్లో ఎస్ఐడీహెచ్ పోర్టల్ లో ప్రత్యేక ఖాతాను ఏర్పాటుచేసుకుని ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలన్నారు.

News September 7, 2025

ఐదేళ్లలో 50 వేల మందికి విదేశాల్లో ఉద్యోగాలు: మంత్రి లోకేశ్

image

AP: సీడాప్ ద్వారా వచ్చే ఐదేళ్లలో 50 వేల మందికి విదేశాల్లో ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్లు మంత్రి లోకేశ్ తెలిపారు. ఈ నెలలోనే నైపుణ్యం పోర్టల్‌ను ప్రారంభిస్తామన్నారు. అంతర్జాతీయ ప్లేస్ మెంట్ పథకం కింద జర్మనీ ఆసుపత్రుల్లో ఉద్యోగాలు పొందిన అభ్యర్థులను అభినందించారు. తొలి బ్యాచ్‌లో సీడాప్ ద్వారా మొత్తం 171 మందికి శిక్షణనివ్వగా, ఇప్పటికే వివిధ విభాగాల్లో 40 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారని తెలిపారు.