News April 3, 2024

కరవు వచ్చింది.. ఊరు తేలింది

image

TG: వేసవి ఆరంభంలోనే రాష్ట్రాన్ని కరవు ఛాయలు కమ్ముకున్నాయి. మిడ్ మానేరు ప్రాజెక్టులో నీరు తగ్గడంతో ముంపు గ్రామాలు బయటపడుతున్నాయి. ఈ ప్రాజెక్టు నిర్మాణ సమయంలో 11 గ్రామాలు ముంపునకు గురయ్యాయి. ఇప్పుడు కుడి, ఎడమ కాలువలతో పాటు లోయర్ మానేర్ డ్యామ్‌కు నీటిని విడుదల చేస్తుండటంతో మిడ్ మానేరు ప్రాజెక్టులో నీరు తగ్గింది. ఇన్నాళ్లు నీటిలో మునిగి ఉన్న ముంపు గ్రామాల్లోని ఇళ్లు, స్కూళ్లు, ఆలయాలు బయటపడుతున్నాయి.

Similar News

News January 6, 2025

ఘోరం.. పిల్లలకు విషమిచ్చి పేరెంట్స్ ఆత్మహత్య

image

బెంగళూరులో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్, అతని భార్య తమ ఇద్దరు పిల్లలకు విషమిచ్చి చంపేసి తామూ ఆత్మహత్య చేసుకున్నారు. మృతులను అనూప్ కుమార్(38), రాఖీ(35), అనుప్రియ(5), ప్రియాంశ్(2)గా గుర్తించారు. వీరి స్వస్థలం యూపీలోని ప్రయాగ్ రాజ్ అని పోలీసులు తెలిపారు. తీవ్ర ఆర్థిక సమస్యలతోనే సూసైడ్ చేసుకున్నట్లు భావిస్తున్నామన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు చెప్పారు.

News January 6, 2025

రెండు గ్రామాల మధ్య ‘దున్నపోతు’ పంచాయితీ

image

AP: దేవర దున్నపోతు కోసం అనంతపురం(D)లోని 2 గ్రామాల మధ్య వివాదం రాజుకుంది. కూడేరు(M) ముద్దలాపురం, కదరగుంటలో దేవర నిర్వహణకు ఇరు గ్రామాల ప్రజలు నిర్ణయించారు. బలి ఇవ్వడానికి చెరో దున్నపోతును ఎంపిక చేశారు. అయితే గ్రామంలోకి వచ్చిన దున్నపోతును కదరగుంట వాసులు బంధించగా, అది తమదేనని ముద్దలాపురం ప్రజలు వాదిస్తున్నారు. గొడవలు జరిగే అవకాశం ఉండటంతో పోలీసులు బందోబస్తు ఏర్పాటుచేశారు. ఈ వ్యవహారం SP వరకు వెళ్లింది.

News January 6, 2025

ఆరాంఘర్ ఫ్లైఓవర్‌ను ప్రారంభించిన సీఎం

image

TG: ఆరాంఘర్-జూపార్క్ ఫ్లై ఓవర్‌ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. 6 లేన్లతో కూడిన 4.08KM పొడవైన ఈ ఫ్లై ఓవర్‌ను రూ.799 కోట్ల వ్యయంతో నిర్మించారు. దీంతో మహబూబ్ నగర్, బెంగళూరు, కర్నూలు వెళ్లేవారికి ట్రాఫిక్ సమస్యలు తీరనున్నాయి. హైదరాబాద్‌లోనే ఇది రెండో అతిపెద్ద ఫ్లై ఓవర్ కావడం గమనార్హం.