News September 1, 2025

MNCL: ‘పెన్షన్ భిక్ష కాదు.. విశ్రాంత ఉద్యోగుల హక్కు’

image

పదవీ విరమణ పొందిన ఉద్యోగుల పెండింగ్ బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని విశ్రాంత ఉద్యోగుల సంఘం నాయకులు బి.కృష్ణ, గుండేటి యోగేశ్వర్ డిమాండ్ చేశారు. సోమవారం మంచిర్యాల కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన ధర్నాలో వారు మాట్లాడారు. పెన్షన్ భిక్ష కాదు.. విశ్రాంత ఉద్యోగుల హక్కు అని అన్నారు. రిటైరై ఏడాదిన్నర గడిచిన ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం మంజూరు చేయలేదని తెలిపారు.

Similar News

News September 7, 2025

US, చైనాలో ఇండియా దేనికి క్లోజ్? నిర్మల ఏమన్నారంటే?

image

కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజల భద్రత, శ్రేయస్సుకే ప్రాధాన్యం ఇస్తుందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ప్రపంచ దేశాలతో భారత సంబంధాలపై ఆమె మాట్లాడారు. US, చైనాలో IND దేనికి క్లోజ్ అని ఎదురైన ప్రశ్నకు బదులిస్తూ ‘IND అంతటా స్నేహితుల్ని కోరుకుంటుంది. Quad, BRICS, RIC మూడింట్లో ఉంటుంది. కానీ నిర్ణయాలు స్వతంత్రంగా తీసుకుంటుంది’ అని స్పష్టం చేశారు. GST స్లాబ్స్ మార్పునకు US టారిఫ్స్ కారణం కాదన్నారు.

News September 7, 2025

ప్రభాస్-ప్రశాంత్ వర్మ సినిమా ఇప్పట్లో ఉంటుందా?

image

ప్రభాస్‌తో సినిమా చేసేందుకు స్క్రిప్ట్ రెడీగా ఉందని, హీరో డేట్స్ దొరకడమే ఆలస్యమని డైరెక్టర్ ప్రశాంత్ వర్మ చెప్పడంతో ఈ ప్రాజెక్టు ఎప్పుడు పట్టాలెక్కుతుందనే దానిపై చర్చ మొదలైంది. ప్రస్తుతం ప్రభాస్ ‘రాజాసాబ్’, ‘ఫౌజీ’తో బిజీగా ఉన్నారు. తర్వాత స్పిరిట్, కల్కి-2, సలార్-2 లైన్‌లో ఉన్నాయి. అటు ప్రశాంత్ ‘జై హనుమాన్’ తీస్తున్నారు. ఈ నేపథ్యంలో వీరి కాంబోలో సినిమా రావడానికి మరింత టైమ్ పట్టే ఛాన్సుంది.

News September 7, 2025

సోషల్ మీడియాలో ప్రచారం అవాస్తవం: VZM కలెక్టర్

image

జిల్లాలో ఎరువుల కొరత లేదని కలెక్టర్ అంబేడ్కర్ శనివారం మరోసారి ప్రకటించారు. రాజాంలోని నందిని ట్రేడర్స్‌కు ఈనెల 4న 24 టన్నుల యూరియా సరఫరా చేశామని, తగినంత స్టాకు ఉందన్నారు. షాపు దగ్గర నిలుచున్నప్పుడు ఇద్దరు వ్యక్తుల మధ్య తలెత్తిన చిన్నపాటి ఘర్షణే గొడవకు కారణమన్నారు. దీనికి ఎరువుల సరఫరాతో సంబంధం లేదని, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అవాస్తవమన్నారు. అవసరమైనంత ఎరువులను సరఫరా చేస్తున్నామన్నారు.