News September 1, 2025
సీఎంకు భద్రాద్రి ఎమ్మెల్యేల వినతి

గిరిజన నియోజకవర్గాల్లో అధిక సంఖ్యలో ఇందిరమ్మ ఇళ్లను కేటాయించాలని కోరుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎమ్మెల్యేలు సోమవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. భద్రాద్రి జిల్లా గిరిజన శాసనసభ్యుల కోరికపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.
Similar News
News September 7, 2025
ప్రభాస్-ప్రశాంత్ వర్మ సినిమా ఇప్పట్లో ఉంటుందా?

ప్రభాస్‌తో సినిమా చేసేందుకు స్క్రిప్ట్ రెడీగా ఉందని, హీరో డేట్స్ దొరకడమే ఆలస్యమని డైరెక్టర్ ప్రశాంత్ వర్మ చెప్పడంతో ఈ ప్రాజెక్టు ఎప్పుడు పట్టాలెక్కుతుందనే దానిపై చర్చ మొదలైంది. ప్రస్తుతం ప్రభాస్ ‘రాజాసాబ్’, ‘ఫౌజీ’తో బిజీగా ఉన్నారు. తర్వాత స్పిరిట్, కల్కి-2, సలార్-2 లైన్‌లో ఉన్నాయి. అటు ప్రశాంత్ ‘జై హనుమాన్’ తీస్తున్నారు. ఈ నేపథ్యంలో వీరి కాంబోలో సినిమా రావడానికి మరింత టైమ్ పట్టే ఛాన్సుంది.
News September 7, 2025
సోషల్ మీడియాలో ప్రచారం అవాస్తవం: VZM కలెక్టర్

జిల్లాలో ఎరువుల కొరత లేదని కలెక్టర్ అంబేడ్కర్ శనివారం మరోసారి ప్రకటించారు. రాజాంలోని నందిని ట్రేడర్స్‌కు ఈనెల 4న 24 టన్నుల యూరియా సరఫరా చేశామని, తగినంత స్టాకు ఉందన్నారు. షాపు దగ్గర నిలుచున్నప్పుడు ఇద్దరు వ్యక్తుల మధ్య తలెత్తిన చిన్నపాటి ఘర్షణే గొడవకు కారణమన్నారు. దీనికి ఎరువుల సరఫరాతో సంబంధం లేదని, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అవాస్తవమన్నారు. అవసరమైనంత ఎరువులను సరఫరా చేస్తున్నామన్నారు.
News September 7, 2025
ఏ దేవుణ్ని ఏ సమయంలో పూజిస్తే మంచిది?

మన ఇష్ట దైవాన్ని ఏ సమయంలోనైనా పూజించవచ్చు. అయితే కొన్ని సమయాలు ఆయా దేవుళ్లకు అనుకూలంగా ఉంటాయని పండితులు అంటున్నారు. వాటి ప్రకారం.. సూర్యుణ్ని ఉదయం 6 గంటల లోపు పూజించాలి. అప్పుడే రాముడు, వేంకటేశ్వర స్వామిని పూజించవచ్చు. శివుణ్ని ఉదయం, సాయంత్రం 6 గంటల తర్వాత పూజిస్తే మంచి ఫలితం దక్కుతుంది. మధ్యాహ్నం వేళ హనుమంతుణ్ని పూజిస్తే ఆయన కరుణా కటాక్షాలు మనపై ఉంటాయి. లక్ష్మీదేవి పూజకు రాత్రి 6-9 అనువైన సమయం.