News September 2, 2025

డిజిటల్ మార్కెటింగ్ ఈ కామర్స్‌పై అవగాహన కల్పిస్తాం: HYD కలెక్టర్

image

HYD జిల్లాలోని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా ఉత్పత్తిదారులకు (MSME) డిజిటల్ మార్కెటింగ్, ఈ-కామర్స్ (ఆన్‌లైన్) పై అవగాహన కల్పిస్తామని జిల్లా కలెక్టర్ హరిచందన ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 17న మధ్యాహ్నం 2 గంటలకు HYD కలెక్టరేట్‌లో పరిశ్రమల శాఖాధికారులు, కమర్షియల్ ట్యాక్స్ అధికారులు, అలాగే బ్యాంకు అధికారుల ఆధ్వర్యంలో ఆన్‌లైన్ ద్వారా విక్రయ విధానంపై అవగాహన కల్పిస్తామని చెప్పారు.

Similar News

News September 3, 2025

ఖైరతాబాద్: నిమజ్జనానికి రూట్ మ్యాప్ రెడీ: సీపీ ఆనంద్

image

గణేశ్ నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు ముందుగానే సిద్ధం చేశామని HYD సీపీ సీవీ.ఆనంద్ తెలిపారు. రూట్ మ్యాప్‌లో భాగంగా ఆయన HYD కలెక్టర్ హరిచందన, రాచకొండ సీపీ సుధీర్‌బాబు, హైడ్రా కమిషనర్ రంగనాథ్‌తో కలిసి బాలాపూర్ గణేశ్ మండపాన్ని ఈరోజు సందర్శించారు. ప్రత్యేక పూజల అనంతరం నిమజ్జన శోభాయాత్ర సాగే చాంద్రాయణగుట్ట, చార్మినార్, మొజాంజాహీ మార్కెట్, అబిడ్స్, ట్యాంక్ బండ్ రూట్‌లను పరిశీలించి పలు సూచనలు చేశారు.

News September 3, 2025

సికింద్రాబాద్: BIS అధికారుల తనిఖీలు

image

సికింద్రాబాద్ సీటీసీ కాంప్లెక్స్‌లో ఉన్న ఓ గోదాంలో ఈరోజు బీఐఎస్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో దాదాపు రూ.8 లక్షల పైగా విలువైన 225 ఉత్పత్తులకు బీఐఎస్ ధ్రువీకరణ లేదని గుర్తించినట్లు తెలిపారు. ఐఎస్ఐ మార్క్ లేని, నకిలీ ఐఎస్ఐ ముద్ర ఉన్న ఉత్పత్తులు జప్తు చేసినట్లు వెల్లడించారు. వీటిలో మిక్సర్లు, ప్రెజర్ కుక్కర్లు, ఫ్యాన్లు తదితర వస్తువులను గుర్తించారు. కేసు నమోదు చేయనున్నట్లు తెలిపారు.

News September 3, 2025

FLASH: HYD: నాంపల్లి కోర్టుకు నాగార్జున, నాగ చైతన్య

image

HYD నాంపల్లి మనోరంజన్ కోర్టుకు సినీ నటుడు అక్కినేని నాగార్జున, ఆయన తనయుడు, హీరో అక్కినేని నాగచైతన్య ఈరోజు హాజరయ్యారు. మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై న్యాయపరమైన విచారణలో భాగంగా ఇద్దరూ కోర్టుకు వచ్చారు. న్యాయమూర్తి ఎదుట తమ స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేసినట్లు సమాచారం. ఈ విచారణపై సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.