News September 2, 2025
త్వరలో మణిపుర్‌లో పర్యటించనున్న మోదీ!

PM మోదీ ఈనెల రెండో వారంలో మణిపుర్‌లో పర్యటిస్తారని తెలుస్తోంది. వందలాది ప్రాణాలు పోతున్నా PM పట్టించుకోవట్లేదని విపక్షాలు విమర్శిస్తున్న వేళ ఈ వార్త ప్రాధాన్యం సంతరించుకుంది. బాధిత కుటుంబాలను ఆయన పరామర్శిస్తారని సమాచారం. 2023 మే 3న అక్కడి తెగల మధ్య హింసాత్మక ఘర్షణలు చెలరేగిన విషయం తెలిసిందే. ఈ ఏడాది ఫిబ్రవరిలో రాష్ట్రపతి పాలన విధించినప్పటి నుంచి రాష్ట్రంలో పరిస్థితులు కాస్త సద్దుమణిగాయి.
Similar News
News September 2, 2025
కలశంపై ఉంచిన కొబ్బరికాయను ఏం చేయాలి?

ముఖ్యమైన పూజలు చేసేటప్పుడు కలశంపై కొబ్బరికాయను ఉంచి పూజిస్తారు. ఈ ఆచారాన్ని కలశ స్థాపన అంటారు. పూజ తర్వాత ఆ కొబ్బరికాయను ఓ వస్త్రంలో చుట్టి ఇంట్లోనే కడుతుంటారు. అలా చేయనివారు దాన్ని పారుతున్న నీటిలో/దగ్గర్లోని జలాశయాల్లో నిమజ్జనం చేయవచ్చని పండితులు సూచిస్తున్నారు. పీఠంపై ఉంచిన బియ్యంతో పాటు కొబ్బరికాయను కూడా బ్రాహ్మణులకు ఇవ్వొచ్చని అంటున్నారు. బ్రాహ్మణులు ఆ కొబ్బరికాయను ‘పూర్ణాహుతి’కి వాడతారు.
News September 2, 2025
వర్షం మొదలైంది..

TG: హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం మొదలైంది. అల్వాల్, కుత్బుల్లాపూర్ తదితర ప్రాంతాల్లో వాన పడుతోంది. ఈరోజు సాయంత్రం 4 గంటల వరకు నగరంలోని పలు ప్రాంతాలతో పాటు ఆదిలాబాద్, సంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వికారాబాద్, వనపర్తి, జనగాం, భూపాలపల్లి, గద్వాల, కరీంనగర్, ఆసిఫాబాద్ తదితర జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని IMD హైదరాబాద్ తెలిపింది.
News September 2, 2025
చరిత్ర లిఖించిన ‘సైయారా’ మూవీ

మోహిత్ సూరి దర్శకత్వంలో అహాన్ పాండే, అనీత్ పడ్డా జంటగా తెరకెక్కిన ‘సైయారా’ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ చిత్రం ఇప్పటివరకూ రూ.581కోట్లు(గ్రాస్) రాబట్టినట్లు మేకర్స్ ప్రకటించారు. దీంతో భారత సినీ చరిత్రలో అత్యధిక గ్రాస్ వసూళ్లు రాబట్టిన లవ్ స్టోరీగా నిలిచినట్లు వెల్లడించారు. ఇప్పటికీ థియేటర్లలో విజయవంతంగా ఆడుతున్నట్లు తెలిపారు. భారీ విజయం అందించినందుకు ప్రేక్షకులకు ధన్యవాదాలంటూ ట్వీట్ చేశారు.