News September 2, 2025
సినీ ముచ్చట్లు

* బాహుబలి మూవీపై త్వరలో డాక్యుమెంటరీ రిలీజ్ కాబోతున్నట్లు హీరోయిన్ అనుష్క శెట్టి వెల్లడించారు. తన పోర్షన్ షూటింగ్ పూర్తైందని తెలిపారు.
* శ్రీదేవి నటించిన బాలీవుడ్ మూవీ ‘చాల్‌బాజ్’ సీక్వెల్‌లో ఆమె కూతురు జాన్వీ కపూర్ నటించనున్నట్లు సినీ వర్గాల టాక్.
* భవిష్యత్‌లో మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ లేకుండా ఏ మూవీ తీయను. అతడు ఇండస్ట్రీకి దూరమైతేనే ఇతర ఆప్షన్స్ పరిశీలిస్తా: డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్
Similar News
News September 22, 2025
కారణం లేకుండా మాపైకి రావడంతో దీటుగా బదులిచ్చా: అభిషేక్

ASIA CUP: నిన్నటి భారత్, పాక్ మ్యాచ్ సందర్భంగా అభిషేక్ శర్మ- రౌఫ్, అఫ్రీది మధ్య హీటెడ్ డిస్కషన్ జరిగింది. వీటిపై అభిషేక్ స్పందిస్తూ.. ‘కారణం లేకుండా పాక్ ప్లేయర్లు మాపైకి వచ్చారు. అది నాకు నచ్చలేదు. అందుకే వారికి దీటుగా బదులిచ్చా. జట్టు విజయం కోసం పోరాడా’ అని చెప్పారు. గిల్‌తో భాగస్వామ్యంపై మాట్లాడుతూ.. ‘ఇద్దరం స్కూల్ డేస్ నుంచి కలిసి ఆడుతున్నాం. ఒకరి ఆటను మరొకరం గౌరవిస్తాం’ అని చెప్పారు.
News September 22, 2025
KBCలో రూ.50లక్షలు గెలుచుకున్న కార్పెంటర్

అమితాబ్ బచ్చన్ ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’తో ఓ సామాన్యుడు కోటీశ్వరుడు కాకపోయినా లక్షాధికారి అయ్యాడు. పంజాబ్‌లోని హుస్సేన్‌పూర్‌కు చెందిన చందర్‌పాల్ కార్పెంటర్ వర్కర్. పెద్దగా చదువుకోకపోయినా వివిధ అంశాలపై జ్ఞానం పొంది, కేబీసీలో పాల్గొన్నాడు. అమితాబ్ అడిగిన రూ.50 లక్షల ప్రశ్నకు ఆడియన్స్ పోల్, 50-50 ఆప్షన్లు వాడుకొని సరైన సమాధానం చెప్పాడు. పిల్లల చదువుకు, వ్యాపార విస్తరణకు డబ్బును ఉపయోగిస్తానన్నాడు.
News September 22, 2025
‘SIR’ అమలుకు ఈసీ ఆదేశాలు

దేశవ్యాప్తంగా ఓటరు జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR)ను అమలు చేసేందుకు ఈసీ సిద్ధమవుతోంది. ఈనెల 30లోపు గతంలో ప్రచురించిన ఓటరు జాబితాలతో సిద్ధంగా ఉండాలని అన్ని రాష్ట్రాలకు సీఈవోలకు సమాచారం ఇచ్చింది. ఈ ప్రక్రియను అక్టోబర్-నవంబర్‌లో ప్రారంభించే అవకాశం ఉందని సూత్రప్రాయంగా తెలిపింది. ఇప్పటికే బిహార్‌లో SIR అమలు చేయగా, అర్హుల ఓట్లు తొలగిస్తున్నారంటూ ప్రతిపక్షాలు ఆందోళనలకు దిగిన విషయం తెలిసిందే.