News April 3, 2024

కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా నిరసనలు: మంద కృష్ణ

image

TG: కాంగ్రెస్ పార్టీ MP అభ్యర్థుల ఎంపిక తీరును నిరసిస్తూ నేటి నుంచి మాదిగలు నిరసనలు చేపట్టనున్నట్లు MRPS అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ తెలిపారు. ‘రాష్ట్రంలో 3 SC రిజర్వుడ్ నియోజకవర్గాలు ఉంటే పెద్దపల్లి, నాగర్‌కర్నూల్ సీట్లు మాలలకు కేటాయించారు. మిగిలిన WGL కోసం ఐదారుగురు మాదిగలు చూస్తుంటే.. మాదిగ ఉపకులమైన బైండ్లకు చెందిన కడియం కావ్యకు ఇచ్చారు’ అని ఆయన అన్నారు.

Similar News

News January 6, 2025

క్రికెట్ లీగ్‌లో అడుగుపెట్టిన అభిషేక్ బచ్చన్

image

బాలీవుడ్ నటుడు ETPL(యూరోపియన్ టీ20 ప్రీమియర్ లీగ్‌)లో అడుగుపెట్టారు. ఇటీవలే ఐసీసీ ఆమోదం పొందిన ETPL ఈ ఏడాది జులైలో ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో ఐర్లాండ్, స్కాట్లాండ్, నెదర్లాండ్స్‌ ప్లేయర్లతో పాటు ప్రపంచస్థాయి క్రికెటర్లు కూడా ఆడతారు. ఈ లీగ్‌లో అభిషేక్ ఓ జట్టుకు కో ఓనర్‌గా వ్యవహరించనున్నారు. కాగా అభిషేక్ ఇప్పటికే PKLలో జైపూర్ పింక్ ఫ్యాంథర్స్ జట్టుకు ఓనర్‌గా ఉన్న విషయం తెలిసిందే.

News January 6, 2025

చైనా వైరస్ ఎఫెక్ట్.. కర్ణాటక ప్రభుత్వం కీలక సూచన

image

కర్ణాటకలో ఇవాళ రెండు hMPV వైరస్ కేసులు వెలుగు చూడటంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు మాస్క్ ధరించాలని సూచించింది. మరోవైపు దేశంలో కేసుల సంఖ్య నాలుగుకు చేరింది.

News January 6, 2025

రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్‌’కు మరో షాక్?

image

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘గేమ్ ఛేంజర్‌’కు తమిళనాడు‌లో మరో షాక్ తగిలినట్లు తెలుస్తోంది. విడుదలకు ముందు నిర్వహించదలచిన ఈవెంట్ క్యాన్సిల్ అయినట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు రాష్ట్రంలో <<15078900>>సినిమా రిలీజ్‌<<>> కూడా చేయొద్దని లైకా ప్రొడక్షన్స్ సూచించినట్లు తెలిపాయి. దీనిపై చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా ‘ఇండియన్-2’ ఫ్లాప్ కావడంతో ఈ మూవీపైనే శంకర్ ఆశలు పెట్టుకున్నారు.