News April 3, 2024
ADB: అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లిన ఉపాధ్యాయుడిపై వేటు

అనుమతి లేకుండానే విదేశీ పర్యటనకు వెళ్లిన ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని బరంపూర్ జిల్లా పరిషత్ పాఠశాల ఉపాద్యాయుడు మహేందర్ యాదవ్‌ను సస్పెండ్ చేస్తూ డీఈవో ప్రణీత మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. మార్చి నెల 9 నుంచి 14 వరకు స్కూల్ అసిస్టెంట్ మహేందర్ యాదవ్ విదేశాలకు వెళ్లారని ఆయనపై పీఆర్టీయూ తెలంగాణ యూనియన్ సభ్యులు ఫిర్యాదు చేశారు. అతడిపై విచారణ జరిపించి వేటువేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.
Similar News
News January 3, 2026
నార్నూర్ అభివృద్ధికి నిధులు సద్వినియోగం చేయాలి: కలెక్టర్

నీతి ఆయోగ్ డేటా ర్యాంకింగ్స్‌లో దేశవ్యాప్తంగా 4వ స్థానం, దక్షిణ భారతదేశంలో 1వ స్థానం సాధించిన నార్నూర్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన రూ.1.5 కోట్ల రివార్డ్ గ్రాంట్‌ను సమర్థవంతంగా వినియోగించాలని కలెక్టర్ రాజర్షిషా ఆదేశించారు. నిధుల వినియోగంపై శుక్రవారం ఆదిలాబాద్ కలెక్టరేట్ లో సమీక్షా సమావేశం నిర్వహించారు. నార్నూర్ సాధించిన ఈ విజయం జిల్లాకే గర్వకారణమని పేర్కొన్నారు.
News January 2, 2026
జైనథ్: కిసాన్ యాప్‌ను వెంటనే తొలగించాలి: మాజీ మంత్రి

రైతులకు అన్యాయం చేసే కిసాన్ యాప్‌ను వెంటనే తొలగించాలని మాజీ మంత్రి జోగు రామన్న డిమాండ్ చేశారు. రైతు కొనుగోలు సమస్యలు పరిష్కరించాలని బీఆర్ఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం జైనథ్ మండలం కాప్రి వద్ద జాతీయ రహదారిపై రైతులతో కలిసి బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. దీంతో వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ జామ్ అయ్యింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను మోసం చేస్తుందని మండిపడ్డారు.
News January 2, 2026
ఆదిలాబాద్: వీడీసీల ఏర్పాటు రాజ్యాంగ విరుద్ధం: ఎస్పీ

వీడీసీలు చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ అఖిల్ మహాజన్ హెచ్చరించారు. గ్రామాభివృద్ధి పేరుతో వసూళ్లకు పాల్పడుతూ బెల్టు షాపులు, కళ్లు దుకాణాలు, ఇసుక తవ్వకాలకు అనధికారికంగా అనుమతులు ఇస్తే వీడీసీలపై కేసులు తప్పవన్నారు. వీడీసీల వల్ల ఇబ్బందులు ఎదుర్కొనేవారు నిర్భయంగా జిల్లా పోలీసులను సంప్రదించాలని సూచించారు.


