News September 2, 2025
7న వాడపల్లిలో దర్శనాల నిలిపివేత

కోనసీమ తిరుమలగా పేరొందిన వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 7వ తేదీ ఆదివారం దర్శనాలను నిలిపివేస్తున్నట్లు ఆలయ డిప్యూటీ కమిషనర్ చక్రధరరావు తెలిపారు. ఆ రోజు రాత్రి సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనున్నందున మధ్యాహ్నం ఒంటి గంటకు ఆలయాన్ని మూసివేస్తామన్నారు. సంప్రోక్షణ, పూజల అనంతరం సోమవారం ఉదయం నుంచి యథావిధిగా దర్శనాలు పునఃప్రారంభమవుతాయని ఆయన పేర్కొన్నారు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.
Similar News
News September 2, 2025
ఏలూరులో యువతి మృతి..బంధువుల ఆందోళన

ఆర్ఎంపీ చేసిన వైద్యం వికటించి యువతి మృతి చెందిందని ఆమె బంధువులు ఆర్ఎంపీ వైద్యుడి క్లినిక్ వద్ద మంగళవారం మధ్యాహ్నం ఆందోళన చేపట్టారు. ఏలూరు తూర్పు వీధి మేకల కబేలా ప్రాంతానికి చెందిన కటారి భారతి రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతోంది. వంగాయగూడెం సెంటర్లో ఆర్ఎంపీ వైద్యుడు రెండు ఇంజక్షన్లు చేశాడని, కొంతసేపటికే స్పృహ కోల్పోయి మృతి చెందినట్లు భారతి బంధువులు తెలిపారు.
News September 2, 2025
టెక్నాలజీ హబ్ ఆఫ్ ఇండియాగా విశాఖ: చంద్రబాబు

AP: విశాఖ త్వరలోనే టెక్నాలజీ హబ్ ఆఫ్ ఇండియాగా మారనుందని సీఎం చంద్రబాబు అన్నారు. పెద్ద ఎత్తున డేటా సెంటర్లు వైజాగ్‌కు వస్తున్నాయని తెలిపారు. రాష్ట్రంలో ప్రతి పోర్టుకు కనెక్టివిటీ మాస్టర్ ప్లాన్ రూపొందిస్తామని ఈస్ట్ కోస్ట్ మారిటైం లాజిస్టిక్స్ సమ్మిట్‌లో సీఎం చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో లాజిస్టిక్స్ కార్పోరేషన్ ఏర్పాటుకు అనుగుణమైన పాలసీని తీసుకొస్తున్నామని పేర్కొన్నారు.
News September 2, 2025
అమలాపురంలో కాలుష్య నియంత్రణ పాటించాలి: కలెక్టర్

అమలాపురంలో రొయ్యల సాగు వ్యాపార యాజమాన్యాలు తప్పనిసరిగా కాలుష్య నియంత్రణ పద్ధతులు పాటించాలని కలెక్టర్ మహేష్ కుమార్ ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. రొయ్యల పరిశ్రమల తనిఖీ కమిటీ సభ్యులకు దిశానిర్దేశం చేశారు. ఆరుగురు సభ్యులు ఉన్న పర్యవేక్షణ కమిటీని ప్రభుత్వం గత మే నెలలో నియమించిందన్నారు.