News September 2, 2025

ఘోరం.. ఒకే ఊరిలో 1,000 మంది మృతి

image

ఆఫ్రికా దేశం సూడాన్‌లో ఘోర ప్రకృతి విపత్తు చోటుచేసుకుంది. డార్ఫర్ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడి ఓ గ్రామంలో 1,000 మందికి పైగా చనిపోయారని సూడాన్ లిబరేషన్ మూమెంట్ వెల్లడించింది. కొంతకాలంగా వర్షాల ధాటికి మర్రా పర్వత ప్రాంతంలో కొండచరియలు విరిగిపడ్డాయని, దాని ప్రభావంతో ఓ గ్రామం మొత్తం తుడిచిపెట్టుకుపోయిందని పేర్కొంది. అంతర్జాతీయ సమాజం తమకు సాయం చేయాలని వేడుకుంది.

Similar News

News September 2, 2025

మళ్లీ థియేటర్లలోకి ‘35 చిన్న కథ కాదు’ చిత్రం

image

నివేదా థామస్, ప్రియదర్శి ప్రధానపాత్రల్లో ‘35 చిన్న కథ కాదు’ సినిమా మరోసారి థియేటర్లలో విడుదల కానుంది. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఈనెల 5న ఈ మూవీని థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్లు నిర్మాత రానా ప్రకటించారు. ‘ఈ టీచర్స్ డేని 35 చిన్న కథ కాదు చిత్రంతో సెలబ్రేట్ చేసుకుందాం’ అని ఆయన ట్వీట్ చేశారు. కాగా గతేడాది సెప్టెంబర్ 6న రిలీజైన ఈ మూవీకి ‘గద్దర్ ఉత్తమ బాలల చిత్రం’ అవార్డు వరించింది.

News September 2, 2025

జియో, ఎయిర్‌టెల్.. మీకూ ఇలా అవుతోందా?

image

జియో, ఎయిర్‌టెల్ సిగ్నల్స్ రాక యూజర్లు ఇబ్బందులు పడుతున్నారు. గ్రామాల్లో ఒకప్పటి రోజులు మళ్లీ రిపీట్ అవుతున్నాయి. ఇంట్లో ఏదో ఒకచోటే సిగ్నల్ ఉండటం, అక్కడే నిలబడి ఫోన్ వాడటం వంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఇక వీడియోలేమో ‘లోడింగ్.. లోడింగ్’ అంటున్నాయి. గ్రామాలను పక్కనపెడితే హైదరాబాద్ వంటి నగరాల్లోనూ నెట్‌వర్క్ సమస్యలు తీవ్రంగా వేధిస్తున్నాయి. ఫోన్లు కలవడం లేదని చాలామంది వాపోతున్నారు. మీరేమంటారు?

News September 2, 2025

టెక్నాలజీ హబ్ ఆఫ్ ఇండియాగా విశాఖ: చంద్రబాబు

image

AP: విశాఖ త్వరలోనే టెక్నాలజీ హబ్ ఆఫ్ ఇండియాగా మారనుందని సీఎం చంద్రబాబు అన్నారు. పెద్ద ఎత్తున డేటా సెంటర్లు వైజాగ్‌కు వస్తున్నాయని తెలిపారు. రాష్ట్రంలో ప్రతి పోర్టుకు కనెక్టివిటీ మాస్టర్ ప్లాన్ రూపొందిస్తామని ఈస్ట్ కోస్ట్ మారిటైం లాజిస్టిక్స్ సమ్మిట్‌లో సీఎం చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో లాజిస్టిక్స్ కార్పోరేషన్‌ ఏర్పాటుకు అనుగుణమైన పాలసీని తీసుకొస్తున్నామని పేర్కొన్నారు.