News September 2, 2025

HYD: నిమజ్జనానికి 259 మొబైల్ క్రేన్లు

image

HYDలోని అన్ని ప్రధాన చెరువుల వద్ద 134 స్థిర క్రేన్లు, 259 మొబైల్ క్రేన్లు ఏర్పాటు చేసినట్లు కమిషనర్ కర్ణన్ తెలిపారు. హైడ్రా, పర్యాటకశాఖ సమన్వయంతో హుస్సేన్‌సాగర్‌లో 9 బోట్లు, DRF బృందాలు, 200 మంది గజఈతగాళ్లను సిద్ధంగా ఉంచామన్నారు. పోలీసుల సహకారంతో 13 కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశామని, ఊరేగింపు సజావుగా జరిగేందుకు 160 గణేశ్ యాక్షన్ టీమ్‌లు నియమించామన్నారు.

Similar News

News September 2, 2025

రాష్ట్రంలో జిల్లా రెండో స్థానం: కలెక్టర్

image

జిల్లాలో భూగర్భ జలాల స్థాయిలను పెంచడానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అంబేడ్కర్‌ తెలిపారు. మంగళవారం తన ఛాంబర్‌లో భూగర్భ జలాల స్థాయిలపై చర్చించారు. జిల్లాలో 3 మీటర్ల లోపల 17 మండలాల్లో, 3 నుంచి 8 మీటర్ల లోపల 9 మండలాల్లో, 8 మీటర్ల లోతులో 2 మండలాల్లో భూ గర్భ జలాల స్థాయిలు ఉన్నాయని, రాష్ట్రంలో బాపట్ల సరాసరి 3.7 మీటర్ల లోతులో ఉంటూ మొదటి స్థానంలో ఉందన్నారు. విజయనగరం 2వ స్థానంలో ఉందని వెల్లడించారు.

News September 2, 2025

సమస్యను తీర్చడం సేవగా భావించాలి: కలెక్టర్

image

అర్జీదారులు తమ సమస్యలు, బాధలు తీరుతాయనే పీజీఆర్ఎస్‌కు వస్తారని, వాటిని అర్ధం చేసుకొని వారి సమస్యలను పరిష్కరించడమే నిజమైన సేవ అని కలెక్టర్ అంబేడ్కర్ పేర్కొన్నారు. మంగళవారం విజయనగరంలోని కలెక్టరేట్ ఆడిటోరియంలో పీజీఆర్ఎస్ నోడల్ అధికారులతో ఆర్జీల పరిష్కారం పై కలెక్టర్ సమీక్షించారు. ఒక ప్రభుత్వ ఉద్యోగిగా ఆర్జీల పరిష్కారం చేయడం ద్వారా ఒకరి సమస్య తీర్చడమే నిజమైన సేవగా భావించాలన్నారు.

News September 2, 2025

స్థిరమైన ఆదాయం వచ్చేలా ప్రైమరీ సెక్టార్ శాఖలు పనిచేయాలి: కలెక్టర్

image

స్వయం సహాయక సభ్యులు, రైతు సంఘాల సభ్యులకు సుస్థిరమైన జీవనోపాధి, స్థిరమైన ఆదాయం వచ్చేలా ప్రైమరీ సెక్టార్ శాఖల అధికారులు పని చేయాలని కలెక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. అనంతపురంలో సంబంధిత అధికారులతో ఆయన సమావేశం ఏర్పాటు చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలపై గ్రామీణ ప్రాంత ప్రజలకు పూర్తి అవగాహన కల్పించాలన్నారు. ప్రభుత్వ అధికారులు ప్రజలకు అనునిత్యం అందుబాటులో ఉండాలన్నారు. లేనిచో చర్యలు తప్పవని హెచ్చరించారు.