News September 2, 2025
HYD: గ్రేటర్‌లో అత్యధిక వర్షపాతం

గ్రేటర్‌లో ఈ వర్షాకాలంలో ఇప్పటివరకు సాధారణం కంటే అధికంగా 31.3% వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. మహానగరం పరిధిలోని మొత్తం 29 మండలాల్లో జూన్-1 నుంచి సెప్టెంబర్-1 వరకు సాధారణంగా 407.7 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా.. 617.8 MM వర్షపాతం నమోదైంది. సాధారణం కంటే అత్యధికంగా అమీర్‌పేట, ఖైరతాబాద్‌లలో 56%, శేరిలింగంపల్లిలో 54% నమోదైంది.
Similar News
News September 3, 2025
KU: వ్యభిచార గృహంపై టాస్క్ ఫోర్స్ దాడి

వ్యభిచార గృహంపై మంగళవారం దాడి చేసినట్లు టాస్క్ ఫోర్స్ ఏసీపీ మధుసూదన్ తెలిపారు. KUC పోలీస్ స్టేషన్ పరిధిలోని విజయగణపతి రోడ్ నం.15లో వ్యభిచారం నిర్వహిస్తున్నారనే విశ్వసనీయ సమాచారంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగారు. ఓ విటుడు, నిర్వాహకుడితో పాటు ఇద్దరు బాధితులను అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించినట్లు వెల్లడించారు.
News September 3, 2025
HYD: మరో పాస్ పోర్ట్ కేంద్రం ఏర్పాటు

HYDలో మరో పాస్ పోర్ట్ కేంద్రం ఏర్పాటు కానుంది. MGBS మెట్రో స్టేషన్‌లో ఈ నెల 15, 16న దీనిని ప్రారంభించనున్నారు. ప్రస్తుతం నగరంలో 3 PSKలు ఉండగా పాత బస్తీతో పాటు తూర్పుభాగంలో ఉండే ప్రజలకు ఈ కేంద్రం ఎంతగానో ఉపయోగపడనుంది. MGBS మెట్రో స్టేషన్ మొదటి అంతస్తులో ఈ కార్యాలయం అందుబాటులోకి రానుంది. దీనిని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి, సహాయక మంత్రి గానీ ప్రారంభించనున్నారు.
News September 3, 2025
జగన్ చట్టాలను లెక్క చేయలేదు: పుల్లారావు

తప్పుడు కేసులను కోర్టులు కొట్టేయడంపై ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు స్పందించారు. నంద్యాలలో చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసించిన టీడీపీ నాయకులపై నాటి పాలకులు పెట్టిన కేసులను న్యాయస్థానాలు కొట్టేశాయని తెలిపారు. చట్టాలను, న్యాయవ్యవస్థను లెక్కచేయని జగన్‌కు ప్రజలు కేవలం 11 సీట్లు ఇచ్చి గుణపాఠం చెప్పారని అన్నారు.