News September 2, 2025
HYD: నేరాలు నివారించడానికి నిఘా: సీపీ

ప్రజల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని HYD సీపీ సీవీ ఆనంద్ అన్నారు. మధురానగర్ PSలో గణేశ్ నిమజ్జన బందోబస్తుపై పోలీసులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అసాంఘిక శక్తులు, పిక్ పాకెటింగ్, ఈవ్ టీజింగ్, గొలుసు దొంగతనం తదితర నేరాలు నివారించడానికి పోలీసులు నిరంతరం నిఘా ఉంచాలన్నారు.
Similar News
News September 3, 2025
IT కారిడార్‌కు మరిన్ని ఎలక్ట్రిక్ బస్ సర్వీసులు: సజ్జనార్

నగరంలోని ఐటీ కారిడార్‌లో ప్రయాణికులకు సేవలందించేందుకు మరిన్ని ఎలక్ట్రిక్ బస్ సర్వీసులు నడపనున్నారు. పలు ప్రధాన ప్రాంతాల నుంచి వీటిని హైటెక్ సిటీకి నడిపేలా చర్యల తీసుకుంటున్నామని ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ సజ్జనార్ తెలిపారు. హయత్‌నగర్, ఇబ్రహీంపట్నం, హకీంపేట, బోడుప్పల్ నుంచి ఐటీ కారిడార్ (విప్రో, వేవ్ రాక్, కోకాపేట, టీహబ్, మైండ్ స్పేస్, హైటెక్ సిటీ)కు కనెక్టివిటీ పెంచుతామని వివరించారు.
News September 2, 2025
HYD: అందుబాటులోకి వచ్చిన హైడ్రా టోల్ ఫ్రీ నంబర్

హైడ్రాకు సంబంధించిన ఫిర్యాదులు స్వీకరించడానికి టోల్‌ఫ్రీ నంబర్ 1070 అందుబాటులోకి వచ్చింది. 1070 నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదులు చేయవచ్చునని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఈరోజు తెలిపారు. హైడ్రా ప్రజావాణికి రాలేని వారు చెరువులు, నాలాలు, పార్కులు, ప్రభుత్వ భూములు, ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలు కబ్జాకు గురైతే వెంటనే ఈ నంబర్‌కి కాల్ చేయవచ్చన్నారు.
News September 2, 2025
HYD: శిల్పారామం వేదికగా సందడి చేయనున్న నిఫ్ట్ విద్యార్థులు

కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న NIFT (నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ) విద్యార్థులు శిల్పారామంలో సందడి చేయనున్నారు. ఈనెల 12 నుంచి 17 వరకు తమ ప్రతిభను నిరూపించుకోనున్నారు. భారతీయ హస్తకళల గొప్పదనాన్ని వివరించడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. విద్యార్థులు తయారు చేసిన ఫ్యాషన్ దుస్తులు, వస్తువులు ఇక్కడ ప్రదర్శిస్తారు.