News September 2, 2025
తెలంగాణ న్యూస్ రౌండప్

✒ ఈ నెలాఖరున డీజీపీ జితేందర్ పదవీ విరమణ.. కొత్త డీజీపీగా శివధర్ రెడ్డి?
✒ ఐసెట్ తొలి విడత సీట్ల కేటాయింపు పూర్తి.. ఈ నెల 5లోపు ఫీజు చెల్లింపు, 15, 16 తేదీల్లో కాలేజీల్లో రిపోర్టింగ్
✒ రాష్ట్రంలో గత 8 నెలల్లో 181 మంది అవినీతి అధికారుల అరెస్ట్
✒ రాష్ట్ర GST వసూళ్లలో 12% వృద్ధి
✒ నాగారం భూదాన్ భూముల కేసులో రూ.4.80 కోట్ల ఆస్తుల జప్తు
Similar News
News September 2, 2025
T20Iల్లో టాప్ వికెట్ టేకర్‌గా రషీద్ ఖాన్

అఫ్గానిస్థాన్ బౌలర్ రషీద్ ఖాన్ సరికొత్త చరిత్ర సృష్టించారు. టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ఆయన అవతరించారు. ఇప్పటివరకు రషీద్ 165 వికెట్లు పడగొట్టారు. ఈ క్రమంలో టిమ్ సౌతీ(164)రికార్డును బద్దలు కొట్టారు. షార్జాలో UAEతో మ్యాచ్‌లో ఈ ఫీట్ సాధించారు. వీరిద్దరి తర్వాత ఇష్ సోధి(150), షకీబ్ (149), ముస్తాఫిజుర్(142), రషీద్(135), హసరంగ(131), జంపా(130), అడైర్(128), ఇషాన్ ఖాన్(127) ఉన్నారు.
News September 2, 2025
అఫ్గాన్‌లో మరోసారి భూకంపం

అఫ్గానిస్థాన్ మరోసారి భూకంపంతో వణికిపోయింది. జలాలాబాద్‌కు 34కి.మీ దూరంలో 5.5 తీవ్రతతో భూమి కంపించినట్లు రాయిటర్స్ తెలిపింది. అయితే ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలేమీ ఇంకా తెలియరాలేదు. కాగా నిన్న సంభవించిన భారీ <<17592698>>భూకంపం<<>> ధాటికి అఫ్గాన్‌లో 1400 మంది మరణించిన విషయం తెలిసిందే.
News September 2, 2025
VIRAL: 1954 నుంచి ఖైరతాబాద్ గణేశుడు

ఎంతో ప్రఖ్యాతి చెందిన ఖైరతాబాద్ గణేశుడిని 1954 నుంచి ప్రతిష్ఠిస్తున్నారు. తొలి ఏడాది ఒక్క అడుగుతో మొదలు పెట్టి ప్రస్తుతం 69 అడుగుల ఎత్తులో రూపొందించారు. గత 72 ఏళ్లలో వివిధ రూపాల్లో, ఎత్తుల్లో ప్రతిష్ఠించగా.. కొన్నేళ్ల నుంచి మట్టి విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నారు. 2020లో కరోనా వల్ల 9 అడుగులే పెట్టి 2021 నుంచి మళ్లీ విగ్రహం ఎత్తును పెంచారు. ఇన్నేళ్లలోని గణనాథుల్లో కొన్నింటిని పైఫొటోల్లో చూడొచ్చు.