News April 3, 2024

కడప: YSR 5 వేలు.. YS జగన్ 5 లక్షలతో గెలుపు

image

కడప MP ఎన్నికల్లో అరుదైన రికార్డు ఉంది. అక్కడ రాజ శేఖర్ రెడ్డి 4 సార్లు పోటీ చేయగా.. YS జగన్ 2 సార్లు పోటీ చేశారు. YSR 1996లో మొదటిసారి MPగా పోటీ చేసినప్పుడు TDP అభ్యర్థి కందుల రాజమోహన్ రెడ్డిపై 5445 ఓట్లతో గెలిచారు. అలాగే జగన్ 2011 ఉప ఎన్నికల్లో 5,45,671 ఓట్ల తేడాతో డి.ఎల్ రవీంద్రారెడ్డిపై గెలిచారు. ఇప్పటి వరకు జరిగిన కడప ఎంపీ ఎన్నికల్లో YSRకు అత్యల్ప ఓట్లు రాగా.. జగన్‌కు అత్యధిక ఓట్లు వచ్చాయి.

Similar News

News September 5, 2025

పులివెందులకు బై ఎలక్షన్ ఖాయం: రఘురామ

image

మాజీ సీఎం జగన్‌పై అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘చందమామ కోసం మారాం చేసినట్లుగా జగన్ ప్రతిపక్ష హోదా కోసం తాపత్రయపడుతున్నారు. ఈసారి అసెంబ్లీ సమావేశాలకు ఆయన రాకపోతే పులివెందులకు బై ఎలక్షన్ వస్తుంది. ఎమ్మెల్యేలు శాసనసభా సమావేశాలను బహిష్కరిస్తే ఆ పదవికి అర్హత లేనట్లుగా భావించాలి. అసెంబ్లీ ఉపసభాపతిగా సమావేశాలకు జగన్ రావాలని కోరుతున్నా.’ అని తెలిపారు.

News September 5, 2025

కడప జిల్లా విద్యుత్ ప్రాజెక్టులపై మంత్రివర్గం ఆమోదం

image

సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో కడప జిల్లాలో 2,560 MW సామర్థ్యం కలిగిన పలు విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. జమ్మలమడుగు, ముద్దనూరు మండలాల్లోని గ్రామాల్లో100 MW విండ్ పవర్ ప్రాజెక్టులు, మైలవరం మండలంలో 60 MW హైబ్రిడ్ విండ్ సోలార్ పవర్ ప్రాజెక్ట్, కొప్పోలులో 2400 MW పంపుడ్ స్టోరేజ్ పవర్ ప్రాజెక్టుల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

News September 5, 2025

తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం: కలెక్టర్

image

కడప జిల్లా విద్యార్థుల్లో క్రమశిక్షణను, జ్ఞానాన్ని పెంపొందించి, లక్ష్యం పట్ల స్పష్ఠమైన అవగాహన కలిగించి, వారిని కార్యసాధకులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర అపూర్వమైనదని జిల్లా కలెక్టర్ శ్రీధర్ శుక్రవారం తెలిపారు. మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా విద్యాప్రదాతలందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.