News September 2, 2025
భద్రకాళి అమ్మవారి దివ్య దర్శనం

భద్రకాళి దేవస్థానంలో ఆలయ అర్చకులు ఉదయాన్నే అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేశారు. ప్రాతఃకాల విశేష దర్శనంలో అమ్మవారు దర్శనమిచ్చారు. అనంతరం అమ్మవారికి విశేష పూజలు చేసి హారతి ఇచ్చారు. భక్తులు ఉదయం నుంచి ఆలయం చేరుకొని అమ్మవారిని దర్శించుకుని పూజలు చేస్తున్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తున్నారు. దేవస్థాన అర్చకులు తదితరులు ఉన్నారు.
Similar News
News September 1, 2025
WGL: ఆగస్టు మాసాన్ని ఒక్కసారి నెమరేసుకుందామా..!

1. ఓరుగల్లు నగరాన్ని ముంచెత్తిన వానలు
2. కాంగ్రెస్ జనహిత పాదయాత్ర
3. DCCB, సొసైటీల పదవీ కాలం పెంపు
4. ఖిలా వరంగల్ తహశీల్దార్ ఇంట్లో ఏసీబీ అధికారుల సోదాలు
5. వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభం
6. స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
7. యూరియా కొరతతో రైతుల ధర్నాలు
8. పంద్రాగస్టు వేడుకలు
9. శ్రావణమాసంతో ఆలయాలు కిటకిట
10. భద్రకాళి ఆలయ ఈవోల బదిలీ
News September 1, 2025
వరంగల్: మళ్లీ ముసురుకుంటున్న వాన..!

మూడు రోజులుగా గెరువిచ్చిన వాన మళ్లీ ముసురుకుంటోంది. ఆదివారం రాత్రి నుంచి చినుకులు పడుతూనే ఉన్నాయి. సోమవారం ఉదయం నగరంలో కారుమబ్బులు కమ్ముకున్నాయి. జిల్లాలో సరాసరి 35 మి.మీ వర్షపాతం నమోదు కాగా ఖానాపూర్‌లో 88 మి.మీ అధిక వర్షపాతం నమోదయ్యింది. అలాగే చెన్నరావుపేటలో 80 మి.మీ, నల్లబెల్లిలో 67.1 మి.మీ వర్షపాతం నమోదు కాగా మిగతా మండలాల్లో మోస్తరు నుంచి సాధారణ వర్షపాతం నమోదైంది.
News August 31, 2025
WGL: తప్పుల తడకగా ఓటర్ల జాబితా..! మరో మండలంలో వెలుగులోకి..!

గ్రామ పంచాయతీ అధికారులు ఓటర్ల జాబితాలను విడుదల చేశారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం కడారి గూడెం గ్రామంలో ఒకే వ్యక్తికి రెండు ఓట్లు ఉండడంతో పాటు మరణించిన వారి పేర్ల మీద సైతం ఇంకా ఓట్లు ఉన్నాయని వెలుగులోకి వచ్చింది. తాజాగా గీసుగొండ మండలం మరియపురం గ్రామానికి చెందిన కౌడగాని రాజగోపాల్ కుటుంబ సభ్యుల నాలుగు ఓట్లు మూడు వార్డుల్లో నమోదు కావడం ఆశ్చర్యానికి గురిచేసింది.