News September 2, 2025
NZB: ‘లోకల్ దంగల్’లో ముందుగా ZPTC, MPTC ఎన్నికలు..!

స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ముందుగా జిల్లా ప్రజాపరిషత్, మండల ప్రజా పరిషత్ ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ZPTC సభ్యుల ఎన్నికకు గులాబీ రంగు బ్యాలెట్ పత్రం, MPTC సభ్యుల ఎన్నికకు తెలుపు రంగు బ్యాలెట్ పత్రం ఇచ్చేందుకు నిర్ణయించారు. అయితే 42 శాతం రిజర్వేషన్లకు ఆమోదం లేనప్పటికీ ప్రత్యామ్నాయ మార్గంలో ముందుకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తోందని అధికారులు పేర్కొంటున్నారు.
Similar News
News September 2, 2025
అభివృద్ధి పనులు శరవేగంగా పూర్తి చేయాలి: కలెక్టర్

అభివృద్ధి పనులను తక్షణమే ప్రారంభించి, శరవేగంగా పూర్తి చేయించాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. నిజామాబాద్ నగరం, బోధన్, ఆర్మూర్, భీమ్‌గల్ మున్సిపల్ పట్టణాలలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లకు సంబంధించిన పెండింగ్ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అన్నారు. జిల్లా కార్యాలయంలో అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్తో కలిసి ఇందిరమ్మ ఇళ్లు, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పనుల పురోగతిపై సమీక్షించారు.
News September 2, 2025
ఆనందోత్సాహాలతో గణేష్ నిమజ్జనోత్సవం జరుపుకోవాలి: కలెక్టర్

ప్రశాంత వాతావరణంలో ఆనందోత్సాహాల నడుమ గణేష్ నిమజ్జనోత్సవం జరుపుకోవాలని నిజామాబాద్ కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. పోలీస్ కమిషనర్ పి.సాయిచైతన్య, ఇతర అధికారులతో కలిసి ప్రత్యేక బస్సులో కలెక్టర్ మంగళవారం వినాయక శోభాయాత్ర కొనసాగే మార్గాలను పరిశీలించి మాట్లాడుతూ అపశృతులకు తావులేకుండా ముందు జాగ్రత్తలు చేపట్టాలని ఆదేశించారు.
News September 2, 2025
NZB: నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్, CP, MLA

నిజామాబాద్ నగరంలో నిర్వహించే గణేష్ నిమజ్జన ఏర్పాట్లను అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ నారాయణ జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి పోలీస్ కమిషనర్ సాయి చైతన్యతో కలిసి మంగళవారం పరిశీలించారు. ప్రధాన రోడ్లు, శోభాయాత్ర మార్గాలు, నిమజ్జన గట్ల వద్ద తీసుకోవాల్సిన భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణ, పారిశుద్ధ్యం, విద్యుత్ సౌకర్యాలు, వినాయకుల బావి వద్ద ఏర్పాట్లు, తదితర అంశాలను పరిశీలించారు.