News September 2, 2025
IFSలకు పోస్టింగులు.. సీఎం, డిప్యూటీ సీఎం అభినందనలు

AP క్యాడర్-2023 బ్యాచ్ IFS అధికారులకు ప్రభుత్వం పోస్టింగులు ఇచ్చింది. ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకర్ కొల్లూరు వెంకట శ్రీకాంత్‌కు వెంకటగిరి సబ్ DFOగా, కొప్పుల బాలరాజుకు లక్కవరం సబ్ DFOగా, నీరజ్ హన్స్‌కు డోర్నాల సబ్ DFOగా, గరుడ్ సంకేత్ సునీల్‌కు ప్రొద్దుటూర్ సబ్ DFOగా, బబితా కుమారికి గిద్దలూరు సబ్ DFOగా పోస్టింగులు ఇచ్చింది. వీరంతా CM చంద్రబాబు, Dy.CM పవన్‌ను మర్యాదపూర్వకంగా కలవగా వారు అభినందించారు.
Similar News
News September 22, 2025
వచ్చే నెలలో ప్రభుత్వ ఇంటర్ కాలేజీలకు డిజిటల్ స్క్రీన్లు

TG: సర్కారు జూనియర్ కాలేజీల్లో డిజిటల్ స్క్రీన్లు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే నెలలో వీటిని కళాశాలలకు అందించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వీటి ఏర్పాటు కోసం ప్రతీ కాలేజీకి ఫ్రీ ఇంటర్నెట్, జూమ్ కనెక్షన్ సదుపాయం కల్పించనున్నారు. ఈ స్క్రీన్ల ద్వారా జేఈఈ, నీట్, ఎప్ సెట్ తదితర ప్రవేశపరీక్షల్లో శిక్షణ ఇచ్చేందుకు ఫిజిక్స్ వాలా, ఖాన్ అకాడమీలతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది.
News September 22, 2025
నవరాత్రులు: నేడు అమ్మవారిని ఎలా పూజించాలంటే?

విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో నేడు బాలాత్రిపురసుందరీ దేవిగా అమ్మవారు అలంకృతమై భక్తులకు దర్శనమివ్వనున్నారు. మొదటి రోజు అమ్మవారికి గులాబీ రంగు చీర, మందార పువ్వులు సమర్పించి, పరమాన్నం/రైస్ ఖీర్ నైవేద్యంగా పెడతారు. ఈరోజున లలితా త్రిశతి పారాయణం చేస్తే అమ్మవారి అనుగ్రహం లభిస్తుందని పండితులు చెబుతున్నారు భక్తుల కొంగు బంగారమై కోరిన కోర్కెలు తీరుస్తుందని అంటున్నారు.
News September 22, 2025
ఎల్లో అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

ఇవాళ ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, చిత్తూరు, తిరుపతిలో భారీ వర్షాలు కురుస్తాయని APSDMA తెలిపింది. మిగతా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు అవకాశం ఉందని పేర్కొంది. అటు తెలంగాణలో నిర్మల్, నిజామాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట్, గద్వాల్‌లో భారీ వర్షాలు కురుస్తాయని IMD ఎల్లో అలర్ట్ జారీ చేసింది.