News April 3, 2024
రాజానగరం రాజు ఎవరో?
AP: పొత్తులో భాగంగా జనసేన పోటీ చేస్తున్న నియోజకవర్గం తూ.గో(D) రాజానగరం. 2009,14లో ఇక్కడ TDP గెలువగా 2019లో YCP అభ్యర్థి జక్కంపూడి రాజా నెగ్గారు. మరోసారి రాజా YCP నుంచి బరిలో నిలువగా.. జనసేన అభ్యర్థిగా బత్తుల బలరామకృష్ణ పోటీ చేస్తున్నారు. పథకాలు, ఇళ్ల పట్టాల పంపిణీ కలిసొస్తుందని MLA రాజా భావిస్తున్నారు. TDP క్యాడర్ సపోర్ట్, పవన్ ఇమేజ్‌తో గెలుపు ఖాయమని బలరామకృష్ణ ధీమాగా ఉన్నారు.
<<-se>>#ELECTIONS2024<<>>
Similar News
News January 6, 2025
క్రికెట్ లీగ్‌లో అడుగుపెట్టిన అభిషేక్ బచ్చన్
బాలీవుడ్ నటుడు ETPL(యూరోపియన్ టీ20 ప్రీమియర్ లీగ్)లో అడుగుపెట్టారు. ఇటీవలే ఐసీసీ ఆమోదం పొందిన ETPL ఈ ఏడాది జులైలో ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో ఐర్లాండ్, స్కాట్లాండ్, నెదర్లాండ్స్ ప్లేయర్లతో పాటు ప్రపంచస్థాయి క్రికెటర్లు కూడా ఆడతారు. ఈ లీగ్‌లో అభిషేక్ ఓ జట్టుకు కో ఓనర్‌గా వ్యవహరించనున్నారు. కాగా అభిషేక్ ఇప్పటికే PKLలో జైపూర్ పింక్ ఫ్యాంథర్స్ జట్టుకు ఓనర్‌గా ఉన్న విషయం తెలిసిందే.
News January 6, 2025
చైనా వైరస్ ఎఫెక్ట్.. కర్ణాటక ప్రభుత్వం కీలక సూచన
కర్ణాటకలో ఇవాళ రెండు hMPV వైరస్ కేసులు వెలుగు చూడటంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు మాస్క్ ధరించాలని సూచించింది. మరోవైపు దేశంలో కేసుల సంఖ్య నాలుగుకు చేరింది.
News January 6, 2025
రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’కు మరో షాక్?
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘గేమ్ ఛేంజర్’కు తమిళనాడులో మరో షాక్ తగిలినట్లు తెలుస్తోంది. విడుదలకు ముందు నిర్వహించదలచిన ఈవెంట్ క్యాన్సిల్ అయినట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు రాష్ట్రంలో <<15078900>>సినిమా రిలీజ్<<>> కూడా చేయొద్దని లైకా ప్రొడక్షన్స్ సూచించినట్లు తెలిపాయి. దీనిపై చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా ‘ఇండియన్-2’ ఫ్లాప్ కావడంతో ఈ మూవీపైనే శంకర్ ఆశలు పెట్టుకున్నారు.