News April 3, 2024
నేడు కోల్‌కతాతో ఢిల్లీ ఢీ

నేడు విశాఖ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనుంది. ఆడిన 2 మ్యాచుల్లోనూ గెలిచి పాయింట్స్ టేబుల్‌లో 2వ స్థానంలో ఉన్న కోల్‌కతాను ఢీకొనడం 7వ స్థానంలో ఉన్న ఢిల్లీకి సవాల్‌తో కూడుకున్నదే. అయితే.. తొలి 2మ్యాచుల్లో ఓడిన ఢిల్లీ.. CSKతో జరిగిన చివరి మ్యాచ్‌లో అద్భుత విజయం సాధించింది. బ్యాటింగ్‌లో ఓపెనర్లు పృథ్వీషా, వార్నర్ ఫామ్‌లోకి వచ్చారు. మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారో చూడాలి మరి.
Similar News
News April 4, 2026
రూ.1.10కోట్ల విలువైన 3,769 సిలిండర్లు సీజ్

TG: రాష్ట్రంలో ఈ ఏడాది మార్చి 12 నుంచి ఏప్రిల్ 3 వరకు 3,699 డొమెస్టిక్ LPG, 70 చిన్న సిలిండర్లను సీజ్ చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. వీటి విలువ రూ.1.10కోట్లుగా పేర్కొంది. 6A కేసులు 1,275 నమోదయ్యాయని, 216 FIRలు నమోదు చేసినట్లు వెల్లడించింది. పశ్చిమాసియా ఉద్రిక్తతలతో గ్యాస్ కొరత నేపథ్యంలో సిలిండర్లను అక్రమంగా నిల్వ చేసినా, విక్రయించినా ప్రభుత్వం చర్యలు తీసుకొంటున్న సంగతి తెలిసిందే.
News April 4, 2026
అగ్నివీర్ రిక్రూట్‌మెంట్.. 6 రోజులే ఛాన్స్

ఇండియన్ ఆర్మీ అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు ఈ నెల 10 వరకు గడువుంది. 17.5-21 ఏళ్ల వయసున్న అవివాహితులు అర్హులు. నిబంధనల ప్రకారం వయో పరిమితిలో సడలింపు ఉంటుంది. జనరల్ డ్యూటీకి టెన్త్‌లో 45%, అగ్నివీర్ టెక్నికల్(MPC)/క్లర్క్/స్టోర్ కీపర్ పోస్టులకు 12thలో 60% మార్కులు వచ్చి ఉండాలి. అప్లికేషన్ ఫీజు ₹250
వివరాలు, దరఖాస్తు సైట్: <
News April 4, 2026
ఒక్కో విద్యార్థిపై రూ.1,08,000 ఖర్చు చేస్తున్నాం: CM

TG పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు చేసి నర్సరీ నుంచి 12th వరకు నాణ్యమైన విద్యను అందిస్తామని CM రేవంత్ తెలిపారు. 100 నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఒక్కో విద్యార్థిపై రూ.1,08,000 ఖర్చు చేస్తున్నామని ఇబ్రహీంపట్నంలో ఓ ప్రైవేట్ స్కూల్ ప్రారంభోత్సవంలో చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్, భోజనం, రవాణా సౌకర్యం కల్పిస్తామన్నారు.


