News September 2, 2025
ఉట్నూర్‌లో అత్యధిక వర్షపాతం

ఆదిలాబాద్ జిల్లాలో కొన్ని రోజులుగా భారీ వర్షం కురుస్తున్న విషయం తెలిసిందే. అయితే సెప్టెంబర్ 1న ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూరు మండలంలో అత్యధిక వర్షపాతం 105.8 mm వర్షపాతం నమోదయింది. ఆ తర్వాత ఇచ్చోడ లో 102.0mm, ఆదిలాబాద్ రూరల్ మండలం పిప్పల్ధరిలో 101.0mm వర్షపాతం నమోదయింది. ఈరోజు కూడా జిల్లాలో భారీ వర్షాలు ఉన్నాయని.. ప్రజలు జాగ్రత్త వహించాలని వాతావరణ కేంద్రం తెలిపింది.
Similar News
News September 3, 2025
ADB: 3 రోజులు వైన్స్ బంద్

ADB అబ్కారీ సర్కిల్ పరిధిలో గణేశ్ నిమజ్జనం దృష్ట్యా 3 రోజులు మద్యం దుకాణాలు బంద్ పాటించాలని ఎక్సైజ్ విజేందర్ పేర్కొన్నారు. ఈనెల 3వ తేదీన సాయంత్రం 6 గంటల నుంచి 5వ తేదీ ఉదయం 10 గంటల వరకు తాంసి, భీంపూర్, జైనథ్, మావల, ఆదిలాబాద్, అదేవిధంగా ఈనెల 5వ తేదీ సాయంత్రం 6 నుంచి 7వ తేదీ ఉదయం 10 వరకు బేల, తలమడుగు, జైనథ్, మావల, ఆదిలాబాద్‌లోని వైన్స్, బార్ షాపులు, కల్లు దుకాణాలను మూసి ఉంచాలని సూచించారు.
News September 3, 2025
ADB: ఈ నెలంతా 30 పోలీస్ యాక్ట్ అమలు

జిల్లాలో సెప్టెంబర్ నెలాఖరు వరకు 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలో ఎటువంటి కార్యక్రమాలు, సమావేశాలు ఏర్పాటు చేయాలన్న ముందస్తుగా పోలీస్ శాఖ అనుమతి తీసుకోవాల్సి ఉంటుందన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు అన్నారు.
News September 2, 2025
ADB: ఈనెల 6న ప్రభుత్వ ఉద్యోగులకు క్రీడా పోటీలు

ADB: జిల్లా కేంద్రంలోని ఐపీ స్టేడియంలో ఈనెల 6వ తేదీన ప్రభుత్వ ఉద్యోగులకు క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు డీవైఎస్ఓ శ్రీనివాస్ తెలిపారు. క్రీడల్లో పాల్గొనాలనుకునే ఉద్యోగులు ఈనెల 4వ తేదీన సాయంత్రం 5 గంటల్లోపు తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు 9440765485, 9494956454 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.