News September 2, 2025
జగిత్యాల జిల్లాలో వర్షపాత వివరాలు

జగిత్యాల జిల్లాలో సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు నమోదైన వర్షపాతం వివరాలిలా ఉన్నాయి. బీర్పూర్ మండలం కొల్వాయిలో 84.5 మిల్లీమీటర్లల వర్షపాతం నమోదైంది. గొల్లపల్లి 10.8, మేడిపల్లి 14.5, ధర్మపురి 14.8, ఎండపల్లి 18, సారంగాపూర్ 24.3, వెలగటూర్ 16.3, రాయికల్ 23, పెగడపల్లి 5, మల్లాపూర్ 30.8, జగిత్యాల 10.5, కోరుట్ల 28.8, కథలాపూర్ 38.5, మెట్పల్లిలో 23.8 మి.మీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు ప్రకటించారు.
Similar News
News September 3, 2025
HNK: జిల్లాలో నేటి క్రైమ్ న్యూస్..

✓ పరకాల రక్తపుటేరుకు 78 ఏళ్లు!
✓ JN: మైనర్లకు వాహనం ఇస్తే లక్ష రూపాయల జరిమానా
✓ కాజీపేట: చికిత్స పొందుతూ గుర్తు తెలియని వ్యక్తి మృతి
✓ HNK: గంజాయి పట్టుకున్న పోలీసులకు రివార్డులు
✓ ఆఫర్ల కోసం APK ఫైల్స్ డౌన్లోడ్ చేసుకోవద్దు: WGL సైబర్ పోలీస్
✓ గణేష్ మండపాల వేదికగా సైబర్ నేరాలపై పోలీసుల అవగాహన సదస్సులు
✓ గణేష్ శోభాయాత్రలో డీజేలపై నిషేధం: ASP
News September 3, 2025
జమ్మికుంట: రైలు నుండి పడి వ్యక్తి మృతి

పెద్దపల్లి(D) పాలకుర్తి మం. కుక్కలగూడూర్ గ్రామానికి చెందిన సంగెం నరేష్(33) రైలు నుంచి కిందపడి మృతి చెందాడు. బిజిగిరి షరీఫ్ దర్గా దర్శనానికి వెళ్లి తిరుగు ప్రయాణంలో JMKT-బిజిగిరి షరీఫ్ స్టేషన్ల మధ్య ఫ్లైఓవర్ సమీపంలో ఈ ఘటన జరిగింది. మృతుడి ఫోన్ ఆధారంగా కుటుంబానికి సమాచారం అందించారు. శవాన్ని జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News September 3, 2025
KNR: ప్రభుత్వ భూములు పరిరక్షించాలి: కలెక్టర్

KNR రూరల్ మండలం బొమ్మకల్ పరిధిలోని 728 సర్వే నంబర్‌లోని ప్రభుత్వ భూమిని పరిశీలించారు. ఈ భూమికి పక్కాగా హద్దులు నిర్ణయించాలని, ఆక్రమణలకు గురి కాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వ భూముల్లోని అనధికార కట్టడాలను తొలగించాలన్నారు. ప్రభుత్వ భూములను గుర్తించి పక్కాగా హద్దులు నిర్ణయించాలని, రాతి కడీలు, సూచిక బోర్డులు చేసి ఆక్రమణకు గురి కాకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు.