News September 2, 2025
రేప్ కేసులో అరెస్టు.. పోలీసులపై MLA కాల్పులు

పంజాబ్ సానౌర్ నియోజకవర్గ AAP MLA హర్మీత్ సింగ్ పతాన్‌మజ్రా పోలీసుల కస్టడీ నుంచి తప్పించుకున్నారు. రేప్ కేసులో అరెస్టైన ఆయన్ను స్థానిక స్టేషన్‌కు తరలించారు. అక్కడ తన అనుచరులతో కలిసి ఆయన పోలీసులపై కాల్పులు జరిపి పరారయ్యారు. ఈ కాల్పుల్లో ఒక పోలీసుకు గాయాలయ్యాయి. పారిపోయే క్రమంలో మరో అధికారిని కారుతో గుద్దినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Similar News
News September 4, 2025
పిల్లలకు ఫార్ములా పాలు పడుతున్నారా?

డెలివరీ తర్వాత తల్లికి పాలు పడకపోయినా, పాలు పట్టలేని స్థితిలో ఉన్నా శిశువులకు ఫార్ములా పాలు ఇస్తుంటారు. వీటిని సరైన కొలతలతో, జాగ్రత్తగా పట్టాలి. ఒక స్పూన్ పాలపొడికి ఎన్ని నీళ్లు కలపాలో సరిగ్గా చెక్ చేసుకోవాలి. లేదంటే చిన్నారులకు ఆరోగ్య సమస్యలు వస్తాయి. పాలు కలిపిన వెంటనే వారికి పట్టించాలి. అలాగే వారు ఒకసారి కాస్త తాగి వదిలేసిన వాటిని మళ్లీ ఇవ్వకూడదు. కాచి చల్లార్చిన నీటితో మాత్రమే పాలు కలపాలి.
News September 4, 2025
Parenting: పిల్లల్ని ఒంటరిగా పెంచుతున్నారా?

అమ్మానాన్న విడిపోవడం లేదా ఎవరో ఒకరు చనిపోయినపుడు ఒంటరిగానే పిల్లలను పెంచాల్సి వస్తుంది. ఈ క్రమంలో ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి. మానసిక ఆందోళన, ఒత్తిడి, కుంగుబాటు, కోపం, స్వీయసానుభూతి దూరం చేసుకోవాలి. ఉద్యోగం, పిల్లల సంరక్షణపై శ్రద్ధ చూపిస్తూ జీవితాన్ని సమన్వయం చేసుకోవాలి. పిల్లలు కుంగుబాటుకు గురవకుండా వారికి తోడుగా ఉన్నామనే భరోసా కలిగించాలి. అప్పుడే వారు జీవితంలో ఉత్సాహంగా ముందడుగు వేస్తారు.
News September 4, 2025
సోలో ట్రిప్‌కి వెళ్తున్నారా?

ప్రస్తుతకాలంలో అమ్మాయిలూ సోలో ట్రిప్‌లు చేస్తున్నారు. ఇలాంటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముందే మీరు వెళ్లే ప్రదేశంలో ఆహార, వసతి, రవాణా సౌకర్యాల గురించి తెలుసుకోండి. చిన్న కీపాడ్ మొబైల్‌ని తీసుకెళ్తే అత్యవసర పరిస్థితుల్లో కాల్ చేయడానికి ఉపయోగపడుతుంది. చాలా తక్కువ లగేజ్ ఉండేలా చూసుకోవాలి. కార్డులతో పాటు క్యాష్ తీసుకెళ్లడం మంచిది. ఎప్పటికప్పుడు మీ లొకేషన్‌ని సన్నిహితులకు తెలియజేయాలి.