News September 2, 2025
గాయత్రీ మంత్ర పఠనం.. మోక్షానికి మార్గం

గాయత్రీ మంత్రాన్ని మించిన మంత్రం లేదు. రోజూ కనీసం 108 సార్లు ఈ మంత్రాన్ని జపించడం వల్ల ఓంకార ధ్యానం ద్వారా లభించే ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. ఈ మంత్ర పఠనం వల్ల ఆరోగ్యం, తేజస్సు, అష్టసిద్ధులు ప్రాప్తిస్తాయని అంటున్నారు. ‘గాయత్రీ మంత్రం మనసును శుద్ధి చేసి, సదాలోచనలను, జ్ఞానాన్ని అందిస్తుంది. జనన మరణాల చక్రం నుంచి విముక్తి కలిగించి, మోక్షానికి మార్గం చూపుతుంది’ అని సూచిస్తున్నారు.
Similar News
News September 22, 2025
శుభ సమయం (22-09-2025) సోమవారం

✒ తిథి: శుక్ల పాడ్యమి రా.1.10 వరకు
✒ నక్షత్రం: ఉత్తర ఉ.11.12 వరకు
✒ శుభ సమయములు: ఉ.6.30-7.10 వరకు
సా.7.45-8.10 వరకు ✒ రాహుకాలం: ఉ.7.30-9.00 వరకు
✒ యమగండం: ఉ.10.30-12.00 వరకు
✒ దుర్ముహూర్తం: మ.12.24-1.12 వరకు
మ.2.46-3.34 వరకు
✒ వర్జ్యం: రా.8.14-9.55 వరకు
✒ అమృత ఘడియలు: లేవు
News September 22, 2025
పాక్‌పై టీమ్ ఇండియా విజయం

ఆసియాకప్‌లో పాకిస్థాన్‌తో జరిగిన సూపర్-4 మ్యాచులో భారత్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 172 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత ఓపెనర్లు అభిషేక్ శర్మ(74), గిల్(47) తొలి వికెట్‌కు 105 పరుగులు భాగస్వామ్యం నెలకొల్పారు. స్వల్ప వ్యవధిలో వికెట్లు కోల్పోయినప్పటికీ తిలక్(30*) నిలబడి జట్టుకు విజయాన్ని అందించారు. ఈ టోర్నీలో పాక్‌పై భారత్‌కిది రెండో విజయం. తర్వాతి మ్యాచ్ బుధవారం బంగ్లాదేశ్‌తో ఆడనుంది.
News September 22, 2025
TODAY HEADLINES

* రేపటి నుంచి GST ఉత్సవ్: ప్రధాని మోదీ
* 2039లోనూ బీజేపీ పీఎం అభ్యర్థి మోదీనే: రాజ్‌నాథ్
* రాష్ట్ర ప్రజలంతా సుభిక్షంగా ఉండాలి: భట్టి
* నేను సినిమా ప్రేమికుడిని: పవన్
* కనీసం ఎమ్మెల్యేలనైనా అసెంబ్లీకి పంపు జగన్: హోంమంత్రి అనిత
* ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంపునకు ప్రభుత్వం వ్యతిరేకం: ఉత్తమ్
* కొత్త వారికే H1B వీసా ఫీజు పెంపు: వైట్‌హౌస్ సెక్రటరీ
* 25న AP డీఎస్సీ అపాయింట్‌మెంట్ లెటర్ల పంపిణీ