News September 2, 2025
ఇంటర్ అర్హతతో 48 పోస్టులు

న్యూఢిల్లీలోని ఇంటెలిజెంట్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఇండియా లిమిటెడ్ 48 డేటా ఎంట్రీ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ఇంటర్ పాసై, కంప్యూటర్ పరిజ్ఞానం గల అభ్యర్థులు ఈ నెల 4వరకు అప్లై చేసుకోవచ్చు. టైపింగ్ వేగం నిమిషానికి 30 పదాలు టైప్ చేయగలగాలి. అభ్యర్థులను షార్ట్‌లిస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.590. వెబ్‌సెట్: https://icsil.in/
Similar News
News September 3, 2025
TODAY HEADLINES

* తుమ్మిడిహట్టి వద్ద కొత్త ప్రాజెక్టు: రేవంత్
* టెక్నాలజీ హబ్ ఆఫ్ ఇండియాగా విశాఖ: చంద్రబాబు
* రైతులను చంద్రబాబు గాలికొదిలేశారు: జగన్
* క్రీడాకారుల కోసం ప్రత్యేక సిలబస్: లోకేశ్
* BRS నుంచి కవిత సస్పెండ్
* సీబీఐకి సుగాలి ప్రీతి కేసు
* భారీగా పెరిగిన బంగారం ధరలు
News September 3, 2025
YCP యూరియా ఆందోళనలు వాయిదా

AP: ఈ నెల 6న జరగాల్సిన యూరియా ఆందోళనలను ఈ నెల 9వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు వైసీపీ తెలిపింది. కాగా రాష్ట్రంలో యూరియా కొరతతో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆర్డీఓ ఆఫీసుల ఎదుట నిరసన చేపట్టాలని వైసీపీ నిర్ణయించింది. ఆ తర్వాత ఆర్డీవోలకు వినతి పత్రాలు సమర్పించాలని భావించింది. టీడీపీ నేతలు ఎరువులను బ్లాక్ చేసి పక్కదారి పట్టిస్తున్నారంటూ వైసీపీ ఆరోపిస్తోంది.
News September 3, 2025
రేపు చైనా విక్టరీ పరేడ్.. హాజరుకానున్న షరీఫ్, మునీర్

వరల్డ్ వార్-2లో గెలిచి 80 ఏళ్లవుతున్న నేపథ్యంలో చైనా రేపు విక్టరీ పరేడ్ నిర్వహించనుంది. దీనికి పాక్ PM షరీఫ్, ఆర్మీ చీఫ్ మునీర్ హాజరుకానుండటం గమనార్హం. రష్యా అధ్యక్షుడు పుతిన్, నార్త్ కొరియా నియంత కిమ్ సహా ఆసియా, ఆఫ్రికా, యూరప్, లాటిన్ అమెరికాకు చెందిన పలు దేశాధినేతలు పాల్గొననున్నారు. ఈ పరేడ్‌లో సైనిక శక్తిని చాటేందుకు అత్యాధునిక యుద్ధ విమానాలు, క్షిపణులు, వార్ హెడ్లను చైనా ప్రదర్శించనుంది.