News April 3, 2024

సీఎం ఎందుకు రాజీనామా చేయాలి?: ఆతిశీ

image

లిక్కర్ స్కామ్ కేసులో తిహార్ జైలుకు వెళ్లిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేస్తారా? అనే ప్రశ్నపై ఆప్ మంత్రి ఆతిశీ స్పందించారు. ఆయన రాజీనామా చేసేందుకు ఒక్క కారణం కూడా లేదని ఆమె అన్నారు. లిక్కర్ స్కాం కేసు ఛార్జిషీట్‌లో కేజ్రీవాల్ పేరు లేదని, ఆయన దోషిగానూ తేలలేదని ఆమె చెప్పుకొచ్చారు. అన్నింటికంటే ముఖ్యంగా ఆయనకు ఢిల్లీ అసెంబ్లీలో భారీ మెజార్టీ ఉందని పేర్కొన్నారు.

Similar News

News October 7, 2024

రుణమాఫీ: మోదీకి మంత్రి తుమ్మల ఎదురు ప్రశ్న

image

తెలంగాణలో సంపూర్ణ రుణమాఫీ జరగలేదని ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు స్పందించారు. రూ.18వేల కోట్ల రుణమాఫీ బీజేపీకి, ప్రధాని మోదీకి కనిపించట్లేదా? అని ప్రశ్నించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రుణమాఫీ చేశారా? అని ఎదురు ప్రశ్న సంధించారు. మాఫీ పూర్తవగానే రైతు భరోసా వేస్తామన్నారు. తాము నిత్యం రైతుల్లో తిరుగుతున్నామని, వ్యతిరేకత ఉంటే తమకు నిరసన సెగ తగిలేదని గాంధీ భవన్‌లో అన్నారు.

News October 7, 2024

మాది మనసున్న మంచి ప్రభుత్వం: మంత్రి లోకేశ్

image

AP: అన్ని వర్గాల క్షేమం కోరే మనసున్న మంచి ప్రభుత్వం తమదని మంత్రి లోకేశ్ చెప్పారు. పాదయాత్రలో ఇచ్చిన ప్రతిహామీని అమలు చేసేందుకు చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని తెలిపారు. ఆదాయం లేని ఆలయాల్లో ధూప, దీప, నైవేద్యాలకు ఇబ్బందిగా ఉందని బ్రాహ్మణులు తన దృష్టికి తీసుకొచ్చారని, ఇప్పుడు వాటికి సాయం ₹10వేలకు పెంచామని పేర్కొన్నారు. దీనివల్ల 5,400 ఆలయాల్లో ఆటంకం లేకుండా భగవంతుడి సేవకు ఆస్కారం ఏర్పడిందన్నారు.

News October 7, 2024

పాత ఉద్యోగికి రూ.23వేల కోట్ల ఆఫర్ ఇచ్చిన గూగుల్

image

ఓల్డ్ ఎంప్లాయీని తిరిగి తీసుకొచ్చేందుకు గూగుల్ ఇచ్చిన ఆఫర్ చర్చనీయాంశంగా మారింది. AI ఎక్స్‌పర్ట్ నోవమ్ షాజీర్‌కు ఏకంగా రూ.23000 కోట్లు ఆఫర్ చేసింది. 2000లో జాయిన్ అయిన నోవమ్ తన MEENA చాట్‌బోట్‌ను మార్కెట్లోకి తీసుకురాలేదని రెండేళ్ల క్రితం వెళ్లిపోయారు. సొంతంగా Character.AIను నెలకొల్పారు. అది ఆర్థిక కష్టాల్లో పడటంతో గూగుల్ ఈ ఆఫర్ ఇచ్చింది. తమ AI ప్రాజెక్ట్ జెమినీకి VPని చేసింది.