News September 2, 2025
కలశంపై ఉంచిన కొబ్బరికాయను ఏం చేయాలి?

ముఖ్యమైన పూజలు చేసేటప్పుడు కలశంపై కొబ్బరికాయను ఉంచి పూజిస్తారు. ఈ ఆచారాన్ని కలశ స్థాపన అంటారు. పూజ తర్వాత ఆ కొబ్బరికాయను ఓ వస్త్రంలో చుట్టి ఇంట్లోనే కడుతుంటారు. అలా చేయనివారు దాన్ని పారుతున్న నీటిలో/దగ్గర్లోని జలాశయాల్లో నిమజ్జనం చేయవచ్చని పండితులు సూచిస్తున్నారు. పీఠంపై ఉంచిన బియ్యంతో పాటు కొబ్బరికాయను కూడా బ్రాహ్మణులకు ఇవ్వొచ్చని అంటున్నారు. బ్రాహ్మణులు ఆ కొబ్బరికాయను ‘పూర్ణాహుతి’కి వాడతారు.
Similar News
News September 3, 2025
పాక్‌ను చిత్తు చేసిన అఫ్గానిస్థాన్

T20I ట్రై సిరీస్‌లో భాగంగా దుబాయ్‌లో పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్ 18 రన్స్ తేడాతో విజయం సాధించింది. అటల్(64), జద్రన్(65) రాణించడంతో తొలుత AFG 20 ఓవర్లలో 169 రన్స్ చేసింది. తర్వాత ఛేజింగ్‌కు దిగిన పాక్ 20 ఓవర్లలో 151/9కే పరిమితమైంది. PAKపై గత 6 మ్యాచ్‌ల్లో AFG 4 గెలవడం విశేషం. పాయింట్స్ టేబుల్‌లో అఫ్గాన్, పాక్ చెరో 4 పాయింట్లతో తొలి 2 స్థానాల్లో, UAE 2 ఓటములతో చివరి ప్లేస్‌లో ఉన్నాయి.
News September 3, 2025
సెప్టెంబర్ 3: చరిత్రలో ఈ రోజు

1893: సంస్కృతాంధ్ర రచయిత్రి కాంచనపల్లి కనకమ్మ జననం
1905: తెలుగు సినీ పాటల రచయిత, కవి కొసరాజు జననం
1908: నిజాం నిరంకుశ పాలనను ఎదిరించిన జమలాపురం కేశవరావు జననం
1952: బాలీవుడ్ నటుడు శక్తికపూర్ జననం(ఫొటోలో)
1978: సినీ నటుడు అర్జన్ బజ్వా జననం(ఫొటోలో)
1987: తెలుగు సంగీత దర్శకుడు రమేశ్ నాయుడు మరణం
2011: పారిశ్రామికవేత్త ముళ్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్ మరణం
News September 3, 2025
అఫ్గానిస్థాన్‌కు భారత్ ఆపన్నహస్తం

భూకంపాలతో <<17592698>>అల్లాడుతున్న<<>> అఫ్గానిస్థాన్‌కు భారత్ ఆపన్నహస్తం అందించింది. బ్లాంకెట్స్, టెంట్స్, వాటర్ ప్యూరిఫయర్స్, జనరేటర్స్, కిచెన్ పరికరాలు, స్లీపింగ్ బ్యాగ్స్, మెడిసిన్స్, వీల్‌ఛైర్స్ తదితర అత్యవసర సామగ్రిని పంపింది. మొత్తం 21టన్నుల రిలీఫ్ మెటీరియల్‌ను విమానంలో కాబూల్‌కు చేర్చినట్లు విదేశాంగ మంత్రి జైశంకర్ వెల్లడించారు. అక్కడి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ సాయం కొనసాగిస్తామని తెలిపారు.