News September 2, 2025

BREAKING: BRS నుంచి కవిత సస్పెండ్

image

TG: MLC కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు BRS ప్రకటించింది. ఆమె వ్యాఖ్యలు పార్టీకి నష్టం కలిగిస్తున్నాయని సస్పెన్షన్ వేటు వేసినట్లు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి రవీందర్ రావు ప్రకటన విడుదల చేశారు. కొంతకాలంగా కవిత పార్టీ వ్యతిరేక స్వరాన్ని వినిపిస్తున్న సంగతి తెలిసిందే. నిన్న ఏకంగా హరీశ్ రావుపైనే అవినీతి ఆరోపణలు చేశారు. కాళేశ్వరంలో హరీశ్, సంతోష్ రావులు అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు.

Similar News

News September 3, 2025

సెప్టెంబర్ 3: చరిత్రలో ఈ రోజు

image

1893: సంస్కృతాంధ్ర రచయిత్రి కాంచనపల్లి కనకమ్మ జననం
1905: తెలుగు సినీ పాటల రచయిత, కవి కొసరాజు జననం
1908: నిజాం నిరంకుశ పాలనను ఎదిరించిన జమలాపురం కేశవరావు జననం
1952: బాలీవుడ్ నటుడు శక్తికపూర్ జననం(ఫొటోలో)
1978: సినీ నటుడు అర్జన్ బజ్వా జననం(ఫొటోలో)
1987: తెలుగు సంగీత దర్శకుడు రమేశ్ నాయుడు మరణం
2011: పారిశ్రామికవేత్త ముళ్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్ మరణం

News September 3, 2025

అఫ్గానిస్థాన్‌కు భారత్ ఆపన్నహస్తం

image

భూకంపాలతో <<17592698>>అల్లాడుతున్న<<>> అఫ్గానిస్థాన్‌కు భారత్ ఆపన్నహస్తం అందించింది. బ్లాంకెట్స్, టెంట్స్, వాటర్ ప్యూరిఫయర్స్, జనరేటర్స్, కిచెన్ పరికరాలు, స్లీపింగ్ బ్యాగ్స్, మెడిసిన్స్, వీల్‌ఛైర్స్ తదితర అత్యవసర సామగ్రిని పంపింది. మొత్తం 21టన్నుల రిలీఫ్ మెటీరియల్‌ను విమానంలో కాబూల్‌కు చేర్చినట్లు విదేశాంగ మంత్రి జైశంకర్ వెల్లడించారు. అక్కడి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ సాయం కొనసాగిస్తామని తెలిపారు.

News September 3, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.