News September 2, 2025
‘సినిమా చెట్టు’కు పునర్జన్మ!

ఏపీలోని వెస్ట్ గోదావరి జిల్లా కుమారదేవం గ్రామంలో ఉన్న ‘సినిమా చెట్టు’ తిరిగి జీవం పోసుకుంటోంది. 145 ఏళ్లనాటి ఈ వృక్షం గతేడాది గోదావరి వరదల వల్ల కూలిపోయింది. రోటరీ క్లబ్ ఈ చెట్టు పునర్జీవం కోసం చేసిన ప్రయత్నాలతో మళ్లీ చిగురించింది. భవిష్యత్తులో ఇక్కడ సినిమా షూటింగ్స్ జరుగుతాయని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. దేవత, బొబ్బిలి రాజా, సీతారామయ్య గారి మనుమరాలు సినిమాల్లో ఈ చెట్టు కనిపించింది.
Similar News
News September 21, 2025
కాసేపట్లో వర్షం

TG: హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో రానున్న 2గంటల్లో వర్షాలు పడతాయని HYD వాతావరణ కేంద్రం అంచనా వేసింది. రాజేంద్ర నగర్, చార్మినార్, ఎల్బీ నగర్, ఉప్పల్, ఖైరతాబాద్, అబిడ్స్, సికింద్రాబాద్, కాప్రా, మల్కాజ్‌గిరి ప్రాంతాల్లో వర్షాలకు ఛాన్స్ ఉందని పేర్కొంది. ఇప్పటికే పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. మీ ఏరియాలో వాతావరణం ఎలా ఉంది?
News September 21, 2025
సెల్ఫీ తీసుకుంటూ జలపాతంలో పడి మృతి

TG: అధికారుల కళ్లుగప్పి 9 మంది యువకులు అనుమతి లేని జలపాతం వద్దకు వెళ్లగా, వారిలో ఒకరు మృతిచెందిన ఘటన ములుగు(D)లో జరిగింది. HYDలోని ఉప్పల్‌కు చెందిన మహాశ్విన్ 8మంది స్నేహితులతో కలిసి వాజేడు(M) కొంగాల జలపాతానికి వెళ్లారు. అక్కడ సెల్ఫీ తీసుకునేందుకు జలపాతం గట్టుమీద కూర్చొని కాలుజారి నీటిలో పడిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి యువకుడి మృతదేహాన్ని వెలికితీశారు.
News September 21, 2025
ఈ ఏడాది నవరాత్రుల ప్రత్యేకత ఏంటంటే?

ఈ ఏడాది చైత్ర నవరాత్రులు ఆదివారం ప్రారంభం కావడంతో దుర్గాదేవి శరన్నవరాత్రుల్లో భూమిపైకి ఏనుగు మీద వస్తుందని పండితులు చెబుతున్నారు. ఈ ఆగమనం అత్యంత శుభప్రదమని అంటున్నారు. ‘అందువల్ల సకాలంలో వర్షాలు కురిసి, పంటలు సమృద్ధిగా పండి, దేశం సుభిక్షంగా ఉంటుంది. దుర్గమ్మ తన భక్తులను కష్టాల నుంచి విముక్తి చేసి, సుఖసంతోషాలను ప్రసాదిస్తుంది. దీంతో మన జీవితాల్లో సానుకూల మార్పులు వస్తాయి’ అని సూచిస్తున్నారు.