News September 2, 2025
కవిత ఎలా రియాక్ట్ అవుతారో?

TG: BRS నుంచి తనను సస్పెండ్ చేయడంపై కవిత ఎలా స్పందిస్తారనేది ఉత్కంఠగా మారింది. ఇప్పటికే పార్టీ నేతలపై సంచలన ఆరోపణలు చేసిన ఆమె, ఇకపై మరింత ఘాటు వ్యాఖ్యలు చేస్తారా? లేక సైలెంట్‌గా ఉంటారా? అనేది ఆసక్తికరం. అయితే కవిత తీరు చూస్తుంటే మౌనంగా ఉండబోరని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కొత్త పార్టీ పెట్టి, రాబోయే రోజుల్లో BRSపై బాణాలు ఎక్కుపెట్టే అవకాశం ఉందంటున్నారు. మీరేమంటారు?
Similar News
News September 21, 2025
వీసా ఫీజు పెంపుపై గందరగోళం.. ఆగిన పెళ్లిళ్లు

US H-1B ఫీజు పెంపు నిర్ణయం నిన్న గందరగోళ పరిస్థితులకు దారితీసింది. పెళ్లి కోసం ఇండియాకు వెళ్లాల్సి ఉన్నా మళ్లీ వచ్చేందుకు రూ.80లక్షలు చెల్లించాలనే భయంతో క్యాన్సిల్ చేసుకున్నామని కొందరు SMలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘ఇది అన్యాయం. నేను రాలేకపోతున్నానని తెలిసి మా అమ్మ ఏడ్చేసింది’ అని ఓ యువతి పోస్ట్ చేసింది. కొత్తవారికే ఫీజు పెంపు అని US <<17779352>>క్లారిటీ<<>> ఇచ్చినప్పటికీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
News September 21, 2025
మళ్లీ ‘నో హ్యాండ్‌షేక్’ అవమానం తప్పదా?

Sep14న మ్యాచ్ ముగిశాక భారత ఆటగాళ్లు తమ క్రికెటర్లకు హ్యాండ్‌షేక్ ఇవ్వకపోవడాన్ని PAK అవమానంగా భావించింది. ఆ వివాదంలోకి రిఫరీ పైక్రాఫ్ట్‌ను లాగి నిందించింది. అతడిని తొలగించకపోతే UAEతో మ్యాచ్ ఆడబోమని ఉడత బెదిరింపులకు దిగింది. ICC వినకపోవడంతో మ్యాచ్ ఆడేసింది. నేడు అతడే రిఫరీగా INDతో మ్యాచ్ ఆడాల్సిన పరిస్థితి వచ్చింది. మళ్లీ ‘నో హ్యాండ్‌షేక్’ అవమానానికి అవకాశం ఉంది. PAK ఈసారి ఎవర్ని నిందిస్తుందో?
News September 21, 2025
బతుకమ్మ చీర: ఇప్పుడు ఒకటి.. సంక్రాంతికి మరొకటి!

TG: బతుకమ్మ చీరల పంపిణీకి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. అనుకున్న సమయానికి చీరలు రాకపోవడంతో ఈ బతుకమ్మకు ఒక చీర, సంక్రాంతి లోపు మరో చీర ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2-3 రోజుల్లో చీరల పంపిణీ ప్రారంభం కానుంది. మహిళా సంఘాల సభ్యులకు మాత్రమే చీరలు ఇవ్వనున్నారు. ఈ సారి ఒక్కో చీరకు ప్రభుత్వం రూ.800 చొప్పున ఖర్చు చేస్తోంది.