News September 2, 2025

కవిత సస్పెన్షన్ సరికాదు: జాగృతి నేతలు

image

TG: BRS నుంచి కవితను సస్పెండ్ చేయడాన్ని ఆమె అభిమానులు, జాగృతి నేతలు తప్పుబట్టారు. కవిత వ్యాఖ్యలపై వివరణ తీసుకోకుండా, షోకాజ్ నోటీసులు ఇవ్వకుండా ఎలా సస్పెండ్ చేస్తారని ప్రశ్నిస్తున్నారు. సస్పెన్షన్ వ్యవహారం ఏకపక్షంగా ఉందని మండిపడ్డారు. ఆమెకు మద్దతు తెలియజేసేందుకు HYDలోని జాగృతి కార్యాలయానికి వారు చేరుకుంటున్నారు. హరీశ్ రావు, జగదీశ్ రెడ్డికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నారు.

Similar News

News January 31, 2026

బంగారం, వెండి ధరలు తగ్గడానికి ఈయనే కారణం!

image

బంగారం, వెండి ధరలు కుదేలవ్వడానికి ప్రధాన కారణం కెవిన్ వార్ష్. ఈయన US సెంట్రల్ బ్యాంకు ఫెడరల్ రిజర్వ్‌ తదుపరి ఛైర్మన్‌ కానున్నారు. ట్రంప్ ఆయనను నామినేట్ చేయడంతో మార్కెట్లు క్రాష్ అవుతున్నాయి. గతంలో ఫెడరల్ రిజర్వ్ గవర్నర్‌గా పనిచేసిన వార్స్ వడ్డీ రేట్ల విషయంలో కఠినంగా ఉంటారు. డాలర్ బలోపేతానికే పెద్దపీట వేస్తారన్న అంచనాలు ఇన్వెస్టర్లను భయంలోకి నెట్టాయి. భారీగా అమ్మకాలు చేపట్టడంతో ధరలు కుప్పకూలాయి.

News January 31, 2026

మానవ శక్తి కేంద్రాల గురించి తెలుసుకుందామా?

image

మన శరీరం అనంత శక్తికి నిలయం. ఇందులో వెన్నుపూస వెంబడి 7 శక్తి కేంద్రాలుంటాయి. వీటినే సప్త చక్రాలు అంటారు. ఇవి శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని నియంత్రిస్తాయి. ఈ చక్రాలను సమతుల్యం చేయడానికి రత్నాలను ధరించడం, కొన్ని పరిహారాలు పాటించడం ఎంతో మేలు చేస్తుందని జ్యోతిష నిపుణులు చెబుతున్నారు. వీటిని సమగ్రంగా నిర్వహించకపోతే నష్టం కూడా జరుగుతుందట. వీటి గురించిన పూర్తి వివరాలను మున్ముందు తెలుసుకుందాం.

News January 31, 2026

ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో గ్రూప్ Y పోస్టులు

image

<>ఇండియన్ <<>>ఎయిర్‌ఫోర్స్ గ్రూప్ Y పోస్టుల(మెడికల్ అసిస్టెంట్)కు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. ఇంటర్(బైపీసీ) విద్యార్థులు 01 JAN, 2006-01Jan 2010 మధ్య, బీఫార్మసీ, డిప్లొమా అర్హతగలవారు జనవరి 1, 2003- జనవరి 1, 2006 మధ్య జన్మించి ఉండాలి. రాత పరీక్ష, సర్టిఫికెట్ వెరిఫికేషన్, PFT, అడాప్టబిలిటీ టెస్ట్, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://iafrecruitment.edcil.co.in