News September 2, 2025
సుల్తానాబాద్: ‘భూ సమస్యలపై తక్షణ చర్యలు తీసుకోవాలి’

PDPL కలెక్టర్ కోయ శ్రీ హర్ష మంగళవారం సుల్తానాబాద్ తహశీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారానికి హైకోర్టు అనుమతినిచ్చిన నేపథ్యంలో అర్హుల జాబితా సిద్ధం చేయాలని సూచించారు. భూ భారతి కింద వచ్చిన దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని, భూ సమస్యలపై తక్షణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ బషిరుద్దిన్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
Similar News
News September 3, 2025
పెరిగిన డిస్కౌంట్.. మరింత చౌకగా రష్యన్ ఆయిల్

భారత్‌కు క్రూడ్ ఆయిల్ మరింత చౌకగా లభించనుంది. రష్యా డిస్కౌంట్స్ పెంచడమే ఇందుకు కారణం. బ్యారల్ ధరపై 3-4 డాలర్ల మేర ధర తగ్గనుంది. ప్రస్తుతం IND రోజుకు 5.4 మిలియన్ల బ్యారళ్ల ఆయిల్ దిగుమతి చేసుకుంటోంది. అందులో 36% రష్యా నుంచే కొంటోంది. ఓవైపు ట్రంప్ 50% టారిఫ్స్‌తో ఒత్తిడి తెస్తున్నా భారత్ వెనక్కి తగ్గకుండా రష్యా, చైనాకు మరింత దగ్గరవుతోంది. తాజాగా చైనాలో జరిగిన SCO సమ్మిట్‌తో అది స్పష్టమైంది.
News September 3, 2025
అంటువ్యాధులు ప్రబలకుండా చూడండి: డీఎంహెచ్ఓ

బషీరాబాద్ మండల కేంద్రంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్(సీహెచ్‌సీ)ను జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డీఎంహెచ్ఓ లలితాదేవి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడి, అందుతున్న వైద్య సేవలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. వర్షాల కారణంగా మలేరియా, డెంగ్యూ వంటి అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున, అన్ని రకాల మందులను అందుబాటులో ఉంచుకోవాలని వైద్యులకు ఆమె సూచించారు.
News September 3, 2025
ప్రకాశం జిల్లాలో 121 ఎరువుల దుకాణాల్లో తనిఖీ

ప్రకాశం జిల్లాలో 121 ఎరువుల దుకాణాలను పోలీసులు తనిఖీ చేసినట్లు జిల్లా ఎస్పీ కార్యాలయం మంగళవారం సాయంత్రం ప్రకటించింది. మంగళవారం ఉదయం నుంచి జిల్లా వ్యాప్తంగా ఎస్పీ దామోదర్ ఆదేశాల మేరకు పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. అధిక ధరలకు యూరియా ఎరువుల విక్రయాలను నియంత్రించడమే లక్ష్యంగా బ్లాక్ మార్కెట్‌లో గల ఎరువులను గుర్తించేందుకు సైతం స్పెషల్ డ్రైవ్‌ను నిర్వహించారు.