News September 2, 2025

దేశంలో మోదీ, ఎన్టీఆర్ గురించే చర్చ!

image

ట్విటర్ వేదికగా ఆగస్టు నెలలో అత్యధికంగా చర్చించుకున్న ప్రముఖుల జాబితాలో ప్రధాని మోదీ ప్రథమ స్థానంలో నిలిచారు. ఇక జులైలో మూడో స్థానంలో ఉన్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజాగా రెండో ర్యాంకుకు ఎగబాకారు. ఆగస్టు 1 నుంచి 31వ తేదీ వరకూ X డేటా, ఇండియాలోని యూజర్ల పోస్ట్స్ నంబర్స్‌ను పరిగణనలోకి తీసుకొని ఈ ర్యాంకులిచ్చారు. వీరి తర్వాత విజయ్, పవన్, గిల్, రాహుల్ గాంధీ, కోహ్లీ, మహేశ్‌బాబు, ధోనీ, రజినీకాంత్ ఉన్నారు.

Similar News

News September 21, 2025

వెజైనల్​ ఇన్ఫెక్షన్స్‌తో ప్రెగ్నెన్సీకి ఇబ్బంది

image

మహిళల్లో వైట్​ డిశ్చార్జ్​ రంగు మారినా, వెజైనా పొడిబారి మంట, దురద వస్తూ స్పాటింగ్ కనిపిస్తున్నా వెజైనల్ ఇన్ఫెక్షన్ ఉన్నట్లే. అయితే కొన్ని ఇన్ఫెక్షన్స్​ వల్ల ఫెలోపియన్​ ట్యూబ్స్​ బ్లాక్​ అవుతాయి. దాంతో పిండం గర్భాశయంలోకి వెళ్లదు. దాన్నే ఎక్టోపిక్​ ప్రెగ్నెన్సీ అంటారు. దీన్ని గుర్తించకపోతే ఫెలోపియన్​ ట్యూబ్స్ పగిలి ప్రాణాలకే ప్రమాదం. కాబట్టి ఏవైనా ఇన్ఫెక్షన్లు వస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి.

News September 21, 2025

BSFలో 1121 ఉద్యోగాలు.. అప్లైకి ఎల్లుండే ఆఖరు

image

<>BSF<<>>లో 1121 హెడ్ కానిస్టేబుల్(రేడియో ఆపరేటర్, రేడియో మెకానిక్) పోస్టులకు దరఖాస్తు చేయడానికి ఎల్లుండే(సెప్టెంబర్ 23) ఆఖరు తేదీ. టెన్త్, ఐటీఐ లేదా ఇంటర్‌(ఎంపీసీ) పాసైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులను రాతపరీక్ష, PST, PET, మెడికల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేస్తారు. అభ్యర్థుల వయసు 18 నుంచి 25ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

News September 21, 2025

25న డీఎస్సీ అపాయింట్‌మెంట్ లెటర్ల పంపిణీ

image

AP: మెగా డీఎస్సీలో ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల 25న నియామక పత్రాలు అందజేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. గురువారం అమరావతిలోని సచివాలయం వెనుక భాగంలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. అయితే సమయంపై క్లారిటీ ఇవ్వలేదు. సీఎం చంద్రబాబు చేతుల మీదుగా నియామక పత్రాలను అభ్యర్థులకు అందిస్తారు. ఈ ప్రోగ్రామ్ ఈ నెల 19న జరగాల్సి ఉండగా వర్షాల కారణంగా ప్రభుత్వం వాయిదా వేసింది.