News September 2, 2025

ఈనెల 5న రేషన్ డీలర్ల బంద్

image

TG: ఐదు నెలల కమీషన్ డబ్బులు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ రాష్ట్ర డీలర్ల సంక్షేమ సంఘం ఈనెల 5న బంద్‌కు పిలుపునిచ్చింది. గత ఐదు నెలలుగా డీలర్లు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపింది. మరోవైపు ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీ ప్రకారం గౌరవ వేతనం రూ.5 వేలు, కమీషన్ రూ.300 పెంచాలని డీలర్లు డిమాండ్ చేస్తున్నారు.

Similar News

News September 21, 2025

స్పీడ్ స్కేటింగ్ ఛాంపియన్‌షిప్స్‌లో భారత్‌కు గోల్డ్

image

చైనాలో జరుగుతున్న స్పీడ్ స్కేటింగ్ వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో తమిళనాడుకు చెందిన ఆనంద్‌ కుమార్ వెల్‌కుమార్ అదరగొట్టారు. 42 కి.మీ మారథాన్‌లో గోల్డ్ మెడల్ సాధించారు. అంతకుముందు ఇదే టోర్నీలో 1000 మీటర్ల విభాగంలో గోల్డ్ మెడల్, 500m విభాగంలో బ్రాంజ్ గెలిచారు. కాగా 2021లో జూనియర్ వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో ఆనంద్‌ స్వర్ణ పతకం గెలిచి అందరి దృష్టిని ఆకర్షించారు. ఆ తర్వాత వరల్డ్ గేమ్స్‌లో కాంస్యం గెలిచారు.

News September 21, 2025

డియర్ లాలెట్టన్.. ఇది మీకు తగిన గుర్తింపు: చిరంజీవి

image

మలయాళ హీరో మోహన్‌లాల్‌కు కేంద్రం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును ప్రకటించిన నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి ఆయనకు విషెస్ తెలిపారు. ‘మై డియర్ లాలెట్టన్.. మీరు ప్రతిష్ఠాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు ఎంపికైనందుకు హృదయపూర్వక అభినందనలు. మీ అద్భుతమైన ప్రయాణం, ఐకానిక్ పెర్ఫార్మెన్స్, భారతీయ సినిమాను సుసంపన్నం చేశాయి. నిజంగా ఇది మీకు తగిన గుర్తింపు’ అని Xలో పేర్కొంటూ మోహన్‌లాల్‌తో ఉన్న ఫోటోను షేర్ చేశారు.

News September 21, 2025

వెజైనల్​ ఇన్ఫెక్షన్స్‌తో ప్రెగ్నెన్సీకి ఇబ్బంది

image

మహిళల్లో వైట్​ డిశ్చార్జ్​ రంగు మారినా, వెజైనా పొడిబారి మంట, దురద వస్తూ స్పాటింగ్ కనిపిస్తున్నా వెజైనల్ ఇన్ఫెక్షన్ ఉన్నట్లే. అయితే కొన్ని ఇన్ఫెక్షన్స్​ వల్ల ఫెలోపియన్​ ట్యూబ్స్​ బ్లాక్​ అవుతాయి. దాంతో పిండం గర్భాశయంలోకి వెళ్లదు. దాన్నే ఎక్టోపిక్​ ప్రెగ్నెన్సీ అంటారు. దీన్ని గుర్తించకపోతే ఫెలోపియన్​ ట్యూబ్స్ పగిలి ప్రాణాలకే ప్రమాదం. కాబట్టి ఏవైనా ఇన్ఫెక్షన్లు వస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి.