News September 2, 2025
18న రిమ్స్‌లో స్పెషలిస్ట్ డాక్టర్ల పోస్టులకు ఇంటర్వ్యూలు

ADB రిమ్స్ ప్రభుత్వ వైద్య కళాశాలలో స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. ఈ నెల 18న రిమ్స్ డైరెక్టర్ కార్యాలయంలో ఇంటర్వ్యూలు జరుగుతాయని రిమ్స్ డైరెక్టర్ డా.జైసింగ్ రాథోడ్ తెలిపారు. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఆదేశాల మేరకు కాంట్రాక్టు ప్రాతిపదికన ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులు ఇతర వివరాలను rimsadilabad.org వెబ్‌సైట్‌లో చూడవచ్చని ఆయన పేర్కొన్నారు.
Similar News
News September 3, 2025
భక్తులను ఆకట్టుకుంటున్న శ్రీనగర్ కాలనీ గణపతి

ADB జిల్లా కేంద్రంలోని శ్రీనగర్ కాలనీలో గడ్డితో తయారు చేసిన ప్రకృతి గణపతి భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాడు. హరియాలీ నుంచి గడ్డి తీసుకొచ్చి ఈ రూపాన్ని ఆవిష్కరించారు. ప్రకృతి గణపతి పక్కన ఏర్పాటు చేసిన సెల్ఫీ పాయింట్ సందర్శకులను ఆకర్షిస్తోంది. పర్యావరణ పరిరక్షణపై ప్రజలకు సందేశం ఇవ్వాలనే ఆలోచనతో ఈ విగ్రహాన్ని రూపొందించినట్లు కాలనీ అధ్యక్షుడు పవర్, ప్రధాన కార్యదర్శి బండారి సంతోష్ తెలిపారు.
News September 3, 2025
ADB: ఈనెల 8న అప్రెంటిస్ షిప్ మేళా

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఐటీఐలో ఈనెల 8న ప్రధానమంత్రి జాతీయ అప్రెంటిస్ షిప్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ శ్రీనివాస్ పేర్కొన్నారు. ఐటీఐ ఉత్తీర్ణులైన విద్యార్థులు www.apprenticeshipindia.gov.in వెబ్ సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత 8వ తేదీన నిర్వహించనున్న మేళాకు హాజరుకావాలని సూచించారు.
News September 3, 2025
APK ఫైల్స్‌తో జర జాగ్రత్త: ఆదిలాబాద్ SP

APK ఫైల్స్ పట్ల అప్రమత్తత తప్పనిసరి అని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రకటనలో తెలియజేశారు. ఆర్టీఏ ఈ చలాన్ పేరుతో వాట్సాప్‌లో ఫేక్ అప్లికేషన్ చక్కర్లు కొడుతోందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వాట్సాప్ గ్రూపుల్లో అడ్మిన్‌లు ఇలాంటి వాటిని వెంటనే తీసివేయాలన్నారు. నకిలీ అప్లికేషన్ల ద్వారా డాటా చోరీ, సైబర్ క్రైమ్ జరిగే ఆస్కారం ఉందన్నారు. సైబర్ క్రైమ్ జరిగిన వెంటనే 1930ను సంప్రదించాలని సూచించారు.