News April 3, 2024

బీసీసీఐ ముందే అలా చేసి ఉండాల్సింది: సిద్ధూ

image

టీ20 ప్రపంచ కప్‌నకు రోహిత్ శర్మను బీసీసీఐ ముందే కెప్టెన్‌గా ప్రకటించి ఉండాల్సిందని మాజీ ప్లేయర్ సిద్ధూ అన్నారు. అలా చేసి ఉంటే ముంబై ఇండియన్స్ సారథిగా కొనసాగి ఉండేవారని అభిప్రాయపడ్డారు. గత ఏడాది అక్టోబర్‌లో రోహిత్‌ను టీ20 WCకు కెప్టెన్‌గా ప్రకటిస్తే బాగుండేదన్నారు. భారత హీరో, టీమ్ ఇండియా సారథిని ముంబై కెప్టెన్‌గా తొలగించడాన్ని ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారని చెప్పారు.

Similar News

News April 10, 2026

రష్యాvs ఉక్రెయిన్.. యుద్ధానికి 2 రోజులు బ్రేక్

image

రష్యా, ఉక్రెయిన్ మధ్య నాలుగేళ్లుగా కొనసాగుతున్న యుద్ధానికి 2 రోజులు బ్రేక్ పడనుంది. క్రిస్టియన్లకు పవిత్రమైన ఆర్థడాక్స్ ఈస్టర్ సందర్భంగా ఈనెల 11న 4PM గంటల నుంచి 12న అర్ధరాత్రి వరకు కాల్పుల విరమణ పాటించనున్నట్లు పుతిన్ ప్రకటించారు. ఉక్రెయిన్ ప్రతిపాదన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు క్రెమ్లిన్ తెలిపింది. కాగా ప్రస్తుతం US దృష్టి ఇరాన్ వైపు మళ్లడంతో ఉక్రెయిన్, రష్యా మధ్య చర్చలు ఆగిపోయాయి.

News April 10, 2026

13 ఏళ్లలోపు పిల్లలకు SM దూరం.. లోకేశ్ కీలక ఆదేశాలు

image

APలో 13 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను దూరంగా ఉంచేందుకు డ్రాఫ్ట్‌ను సిద్ధం చేయాలని మంత్రి లోకేశ్ అధికారులను ఆదేశించారు. అలాగే 13-16 ఏళ్ల వారికి వయసును బట్టి కంటెంట్ అందుబాటులో ఉండేలా విధివిధానాలు రూపొందించాలని సూచించారు. SMలో మహిళలపై విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. నిన్న రాత్రి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు.

News April 10, 2026

ఇలాంటి వారికి చేసే సాయం.. వ్యర్థం!

image

ప్రియములేని విందు పిండివంటల చేటు
భక్తిలేని పూజ పత్రి చేటు
పాత్రమెఱుగనీవిబంగారు చేటురా
విశ్వదాభిరామ! వినుర వేమ!!
తాత్పర్యం: ప్రేమ, ఆప్యాయత లేకుండా పెట్టే విందులో ఎన్ని పిండి వంటలున్నా వ్యర్థమే. భక్తి, శ్రద్ధ లేకుండా చేసే పూజకు వాడే పూలు దండగ. ఇదే తీరున యోగ్యత, అర్హత లేని వారికి చేసే దానం వల్ల ప్రయోజనం ఉండదు.
<<-se>>#PADHYAM<<>>