News September 2, 2025
వీఆర్ పురంలో గుర్తు తెలియని మృతదేహం

వీఆర్ పురం మండలంలోని చిన్న మట్టపల్లి పంచాయతీ పరిధిలోని ప్రత్తిపాక గ్రామ శివారులలో గుర్తు తెలియని పురుష మృతదేహం కనిపించిందని ఎస్ఐ సంతోశ్ కుమార్ మంగళవారం తెలిపారు. శబరి నది నుంచి కొట్టుకుని వచ్చి, బోర్లా పడి ఉందన్నారు. వయసు సుమారు 30 నుంచి 35 ఏళ్లు ఉండొచ్చని అన్నారు. ఎత్తు 5 అడుగుల రెండు అంగుళాలు, ఎరుపు రంగు షార్ట్ వేసుకుని ఉందన్నారు. ఎవరైనా గుర్తు పడితే పోలీస్ స్టేషన్లో సమాచారం అందించాలన్నారు.
Similar News
News September 3, 2025
పెద్దారెడ్డికి లైన్ క్లియర్.. నేడు తాడిపత్రికి రాక

తాడిపత్రి మాజీ MLA కేతిరెడ్డి పెద్దారెడ్డి సుప్రీంకోర్టు ఆదేశాలతో రేపు తాడిపత్రిలోకి వస్తున్నారు. పలుమార్లు తాడిపత్రికి రావాలని ప్రయత్నించినప్పటికీ పోలీసులు అడ్డుకోవడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కేతిరెడ్డి తాడిపత్రిలోకి వెళ్ళవచ్చని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రేపు తాడిపత్రికి వెళ్తారా లేదా చూడాలి.
News September 3, 2025
పెరిగిన డిస్కౌంట్.. మరింత చౌకగా రష్యన్ ఆయిల్

భారత్‌కు క్రూడ్ ఆయిల్ మరింత చౌకగా లభించనుంది. రష్యా డిస్కౌంట్స్ పెంచడమే ఇందుకు కారణం. బ్యారల్ ధరపై 3-4 డాలర్ల మేర ధర తగ్గనుంది. ప్రస్తుతం IND రోజుకు 5.4 మిలియన్ల బ్యారళ్ల ఆయిల్ దిగుమతి చేసుకుంటోంది. అందులో 36% రష్యా నుంచే కొంటోంది. ఓవైపు ట్రంప్ 50% టారిఫ్స్‌తో ఒత్తిడి తెస్తున్నా భారత్ వెనక్కి తగ్గకుండా రష్యా, చైనాకు మరింత దగ్గరవుతోంది. తాజాగా చైనాలో జరిగిన SCO సమ్మిట్‌తో అది స్పష్టమైంది.
News September 3, 2025
అంటువ్యాధులు ప్రబలకుండా చూడండి: డీఎంహెచ్ఓ

బషీరాబాద్ మండల కేంద్రంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్(సీహెచ్‌సీ)ను జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డీఎంహెచ్ఓ లలితాదేవి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడి, అందుతున్న వైద్య సేవలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. వర్షాల కారణంగా మలేరియా, డెంగ్యూ వంటి అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున, అన్ని రకాల మందులను అందుబాటులో ఉంచుకోవాలని వైద్యులకు ఆమె సూచించారు.