News September 2, 2025
సికింద్రాబాద్: రెండు నెలల్లో 33 మంది అరెస్ట్

సికింద్రాబాద్ దక్షిణ మధ్య రైల్వే పరిధిలో నడుస్తున్న రైళ్లను టార్గెట్ చేస్తూ రాళ్లు విసురుతున్న 33 మందిని రైల్వే ప్రొటెక్షన్ పోలీసులు అరెస్ట్ చేశారు. జులై 1 నుంచి ఆగస్టు 31 వరకు 54 రైళ్లపై రాళ్లు రువ్వినట్లు కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో ఇంకా 30 మంది పరారీలో ఉన్నారు. నిందితులను కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు ఆర్పీఎఫ్ అధికారులు తెలిపారు. రైళ్లపై రాళ్లు రువ్వితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Similar News
News September 3, 2025
మరోసారి మెదక్ జిల్లాకు రానున్న సీఎం

సీఎం రేవంత్ రెడ్డి మరోసారి మెదక్ జిల్లాకు రానున్నారు. ఈనెల 4 లేదా 5న భారీ వర్షాలతో తీవ్రంగా దెబ్బతిన్న కామారెడ్డి జిల్లా పోచారంలో జిల్లా అధికారులతో రివ్యూ మీటింగ్లో పాల్గొంటారు. పోచారం ప్రాజెక్ట్ పరిశీలించి రోడ్డు మార్గంలో మెదక్ చేరుకుని, పోలీస్ పరేడ్ గ్రౌండ్లో హెలికాప్టర్ ఎక్కి హైదరాబాద్ బయల్దేరి వెళ్తారని తెలిసింది. తెగిపోయిన పోచారం బ్రిడ్జి వద్ద రోడ్డును పునరుద్ధరిస్తున్నారు.
News September 3, 2025
GWL: ఆగస్టులో షీ టీం పర్ఫామెన్స్ ఇలా!

గద్వాల జిల్లా షీ టీమ్ బృందం ఆగస్టులో యువతులకు, విద్యార్థినులకు, పని ప్రదేశాల్లో మహిళలకు ప్రత్యేకంగా 10-అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, 73-హాట్ స్పాట్ల తనిఖీలు నిర్వహించినట్లు ఎస్పీ శ్రీనివాసరావు మంగళవారం తెలిపారు. 3 పిటిషన్లు స్వీకరించి, 3 ఎఫ్ఐఆర్‌లు నమోదు చేసి, 12 మందిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొని, 12 ఈ-పెట్టి కేసులు నమోదు చేసి 13 కౌన్సిలింగ్ నిర్వహించిందని తెలిపారు.
News September 3, 2025
పుట్లూరులో రైతు ఆర్థిక సంక్షోభానికి సీఎం చలించి సహాయం

పుట్లూరుకు చెందిన తలారి శ్రీనివాసులు చిన్న రైతు. కుక్కల దాడిలో తన గొర్రెలన్నింటినీ కోల్పోయి తీవ్ర ఆర్థిక నష్టానికి గురయ్యారు. ముగ్గురు ఆడపిల్లలు. అందులో ఒకరు దృష్టి లోపంతో బాధపడుతున్నారు. కుటుంబం తీవ్ర సంక్షోభంలో పడింది. పరిస్థితిని MP అంబికా లక్ష్మీనారాయణ సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. సీఎం తక్షణమే స్పందించి రూ.2.4 లక్షల ఆర్థిక సహాయం మంజూరు చేశారు. ఈ చర్య రైతుకు మానసికంగా మద్దతునిచ్చింది.