News April 3, 2024

తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే?

image

AP: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. నిన్న స్వామివారిని 56,228 మంది భక్తులు దర్శించుకున్నారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.4.04 కోట్లు సమకూరింది.

Similar News

News January 6, 2025

పేర్ని నాని ముందస్తు బెయిల్‌పై విచారణ వాయిదా

image

AP: వైసీపీ నేత పేర్ని నాని ముందుస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. అప్పటివరకు ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కాగా సివిల్ సప్లైస్‌కు సంబంధించిన కేసులో పేర్నిని ఏ6గా మచిలీపట్నం పోలీసులు చేర్చారు. ఈ కేసుకు సంబంధించి ఆయన ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు.

News January 6, 2025

ప్రశాంత్ కిశోర్‌కు 14 రోజుల రిమాండ్

image

JSP అధ్యక్షుడు, రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌కు పట్నా సివిల్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఎయిమ్స్‌లో వైద్య పరీక్షల అనంతరం ఆయనను జైలుకు తరలిస్తారు. కాగా BPSC పరీక్షలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పట్నాలోని గాంధీ మైదాన్‌లో ప్రశాంత్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేసి ఆయనను కోర్టులో హాజరుపర్చారు. అక్కడ బాండ్ పేపర్‌పై సంతకం చేయడానికి నిరాకరించడంతో కోర్టు రిమాండ్ విధించింది.

News January 6, 2025

Stock Market: బేర్స్ వెంటాడారు..

image

స్టాక్ మార్కెట్లు సోమ‌వారం భారీగా న‌ష్ట‌పోయాయి. ఇంట్రాడేలో రూపాయి విలువ జీవిత‌కాల క‌నిష్ఠం 85.84 స్థాయికి ప‌త‌న‌మ‌వ్వ‌డం, దేశంలో HMPV కేసులు వెలుగుచూడ‌డం, ఈక్విటీ ఔట్‌ఫ్లో న‌ష్టాల‌కు కార‌ణమయ్యాయి. Sensex 1,258 పాయింట్లు కోల్పోయి 77,964 వ‌ద్ద‌, Nifty 23,616 (-388) వ‌ద్ద స్థిర‌ప‌డ్డాయి. బ్యాంకు, ఆటో, ఫైనాన్స్‌, రియ‌ల్టీ రంగాల షేర్లు భారీగా పతనమయ్యాయి. ఇన్వెస్టర్ల రూ.12 లక్షల కోట్ల సంపద ఆవిరైంది.