News September 2, 2025
వరద బాధిత జిల్లాలకు రూ.200కోట్లు విడుదల

TG: భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన జిల్లాలకు తక్షణ సాయం కింద రూ.200 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తీవ్రంగా ప్రభావితమైన కామారెడ్డి, మెదక్, నిర్మల్, ADB, నిజామాబాద్, ఆసిఫాబాద్, సిరిసిల్లకు రూ.10 కోట్ల చొప్పున, ఇతర జిల్లాలకు రూ.5 కోట్ల ఇవ్వనున్నట్లు పేర్కొంది. ఈ నిధులను రోడ్లు&వంతెనల మరమ్మతులు, విద్యుత్ పునరుద్ధరణ, వరద బాధితులకు ఉపశమనం&పునరావాసం కోసం ఉపయోగించనున్నారు.
Similar News
News September 3, 2025
హీరో రాజ్ తరుణ్‌పై మరో కేసు

టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్‌పై నార్సింగి PSలో మరోసారి కేసు నమోదైంది. జూన్ 30న రాజ్ తరుణ్ అనుచరులతో కలిసి తన కుటుంబసభ్యులపై దాడి చేశారని మాజీ ప్రేయసి లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. బంగారం ఎత్తుకెళ్లడంతో పాటు కుక్కను చంపారని ఆరోపించారు. ఈ ఘటనలో తన తండ్రి గాయపడినట్లు తెలిపారు. ఇది సైబరాబాద్ సీపీ దృష్టికి వెళ్లగా ఆయన ఆదేశాలతో నార్సింగి పోలీసులు తాజాగా కేసు నమోదు చేశారు.
News September 3, 2025
యూరియా సమస్య ఎందుకొచ్చింది: జగన్

AP: రైతులకు యూరియా కూడా ఇవ్వలేని అధ్వాన స్థితిలో కూటమి పాలన ఉందని YCP చీఫ్ జగన్ ధ్వజమెత్తారు. ‘బస్తా యూరియా కోసం రైతులు రోజుల తరబడి పడిగాపులు కాస్తున్నారు. సీజన్‌లో సాగయ్యే పంటల విస్తీర్ణం, ఎంత మొత్తంలో ఎరువుల పంపిణీ చేయాలనేది ఏటా జరిగే కసరత్తే కదా. మరి యూరియా సమస్య ఎందుకొచ్చింది? మా పాలనలో ఈ సమస్య రాలేదు. ఎరువులను మీ పార్టీ నాయకులే దారి మళ్లించి అధిక ధరకు అమ్ముకుంటున్నారు’ అని ట్వీట్ చేశారు.
News September 3, 2025
ఎలాంటి TRS ఎలా అయిపోయింది..

ప్రత్యేక తెలంగాణ కోసం ఏర్పడిన TRS దాదాపు పదేళ్లు అధికారంతో వర్థిల్లింది. ఆ పార్టీ పేరు చెప్పగానే KCR, హరీశ్‌రావు, KTR, కవితే గుర్తొచ్చేవారు. అలాంటి పార్టీ విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటోంది. BRSగా రూపాంతరం చెందడం, 2023 ఎన్నికల్లో ఓటమి పార్టీ రూపురేఖల్ని మార్చింది. ఆపై పలువురు MLAలు BRSను వీడగా, ఇప్పుడు KCR కూతురే దూరమవడం పార్టీ పరిస్థితికి అద్దం పడుతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.