News September 2, 2025
మరింత బలపడనున్న అల్పపీడనం.. రేపు భారీ వర్షాలు

AP: వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రానున్న 24 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉందని APSDMA తెలిపింది. తర్వాత ఒడిశా మీదుగా కదలనున్నట్లు వెల్లడించింది. దీని ప్రభావంతో రేపు రాష్ట్రంలోని శ్రీకాకుళం, మన్యం, అల్లూరి జిల్లాల్లో భారీ వర్షాలు, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూ.గో, ప.గో, ఏలూరు జిల్లాల్లో మోస్తరు వానలు పడే ఛాన్స్ ఉందని పేర్కొంది.
Similar News
News September 21, 2025
పాడి పశువుల్లో కురమ జ్వరంతో నష్టాలు

పశువులకు అనేక రకాల సీజనల్ వ్యాధులు వస్తుంటాయి. వర్షాకాలంలో బలిష్టమైన ఆంబోతులు, ఎద్దులు, ఆవులకు కురమ జ్వరం ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ వ్యాధి పశువులో 3 రోజులు మాత్రమే ఉంటుంది. అయినప్పటికీ.. ఈ సమయంలో పశువులు బాగా నీరసించిపోతాయి. పాల దిగుబడి దాదాపు 80% వరకు తగ్గిపోతుంది. కురమ జ్వరం లక్షణాలు, నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వెటర్నరీ నిపుణులు రాంబాబు కొన్ని సూచనలు చేశారు. అవేంటో చూద్దాం.
News September 21, 2025
పాడి పశువుల్లో కురమ జ్వరం లక్షణాలు

వైరల్ ఫీవర్ కురమ సోకితే పశువు తీవ్రమైన జ్వరంతో బాధపడుతుంది. కాళ్లు పట్టేయడం, పడుకొని లేవలేకపోవటం, కదలకుండా ఉండటం వంటి లక్షణాలు పశువుల్లో కనిపిస్తాయి. దీంతో పాటు పశువుల్లో వణుకు, చెవులు వాలేసి ఉండటం, గురక పెట్టడం, పళ్లు నూరడం, నెమరు వేయకపోవటం, ఆకలి లేకపోవటం, మూలగడం, గొంతు నొప్పి, చొంగ పడటం, కుంటడం, కీళ్ల నొప్పులతో పాటు కండరాల నొప్పులు ఎక్కువగా ఉంటాయి. ముక్కు, కళ్ల నుంచి నీరు వస్తుంది.
News September 21, 2025
గర్భిణులకు బార్లీ సురక్షితమేనా?

బార్లీ వాటర్‌ను తీసుకుంటే ప్రెగ్నెన్సీలో వచ్చే అనేక సమస్యలకు చెక్ పెట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఫైబర్ కంటెంట్ ఉండటం వల్ల మలబద్ధకాన్ని నివారిస్తుంది. కొందరిలో వికారం, గ్యాస్ సమస్యలను కూడా తగ్గిస్తుంది. డెలివరీ తర్వాత బ్రెస్ట్ మిల్క్‌ను పెంచడంలో బార్లీ సహాయపడుతుంది. రోజుకి 1-2 గ్లాసుల బార్లీ నీరు తీసుకోవాలి. ఎక్కువ తీసుకుంటే విరేచనాలు, అలెర్జీ, రక్తస్రావం, సైనస్ వచ్చే ప్రమాదం ఉంటుంది.