News September 2, 2025
రాజకీయ పార్టీ నడిపిన తెలుగు వనితలు వీరే

కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. కాగా తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకు రేణుకా చౌదరి-టీడీపీ-2(1994), లక్ష్మీ పార్వతి-ఎన్టీఆర్ టీడీపీ(1996), విజయశాంతి-తల్లి తెలంగాణ(2005), కొత్తపల్లి గీత-జన జాగృతి(2018), వైఎస్ షర్మిల-వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ(2021) స్థాపించారు. కానీ టీడీపీ-2, ఎన్టీఆర్ టీడీపీ తర్వాతి కాలంలో రద్దు కాగా, మిగతా పార్టీలు ఇతర పార్టీల్లో విలీనమయ్యాయి.
Similar News
News September 3, 2025
సత్యమేవ జయతే: కవిత

TG: ఇవాళ మధ్యాహ్నం బీఆర్ఎస్‌కు, ఎమ్మెల్సీ పదవికి కవిత రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆమె మరో ట్వీట్ చేశారు. ‘నిజం మాట్లాడినందుకు నాకు దక్కిన బహుమతి ఇదే అయితే.. తెలంగాణ ప్రజల కోసం వంద రెట్లు మూల్యం చెల్లించుకోవడానికి సిద్ధం. సత్యమేవ జయతే. జై తెలంగాణ’ అని రాసుకొచ్చారు. బీఆర్ఎస్ నుంచి వస్తున్న విమర్శలకు కౌంటర్‌గానే ఆమె ట్వీట్ చేసినట్లు తెలుస్తోంది.
News September 3, 2025
కవిత.. ఇది పద్ధతి కాదు: నిరంజన్ రెడ్డి

TG: బీఆర్ఎస్ 25 ఏళ్ల ప్రస్థానంలో హరీశ్ రావు పాత్ర మరువలేనిదని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి చెప్పారు. గతంలో హరీశ్‌ను పొగిడిన వారు, ఇప్పుడు విమర్శిస్తున్నారని చెప్పారు. <<17599925>>కవిత<<>> రివర్స్ గేర్ ఎందుకు తీసుకున్నారో అర్థం కావట్లేదన్నారు. రేవంత్ కాళ్లు మొక్కి హరీశ్ సరెండర్ అయ్యారంటూ నీచమైన ఆరోపణలు చేస్తారా? అని ప్రశ్నించారు. దీని వెనుక ఏం జరిగిందో తెలియట్లేదని, ఇది పద్ధతి కాదన్నారు.
News September 3, 2025
రూ.236.2 కోట్లతో మేడారం అభివృద్ధికి మాస్టర్ ప్లాన్: సురేఖ

TG: మహా జాతరలోపు మేడారం అభివృద్ధి పనులు పూర్తి చేయాలని మంత్రి కొండా సురేఖ అధికారులను ఆదేశించారు. రూ.236.2 కోట్లతో మాస్టర్ ప్లాన్ రూపొందించినట్లు చెప్పారు. భక్తుల సందర్శనార్థం అమ్మవార్ల గద్దెల ఎత్తు పెంచాలని పూజారులు ప్రభుత్వం దృష్టికి తీసుకురాగా ఆ మేరకు డిజైన్లు మార్చాలని సూచించారు. సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దెలు ఒకే వరుసలో ఉండేలా ఏర్పాటు చేయాలని ఆదేశించారు.