News September 2, 2025

స్వచ్ఛ ఆంధ్ర అవార్డుల్లో టాప్‌లో నిలవాలి: కలెక్టర్

image

శ్రీకాకుళం జిల్లాకు అధిక సంఖ్యలో స్వచ్ఛ ఆంధ్ర అవార్డులు వచ్చేలా అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి మంగళవారం వీసి ద్వారా సమీక్ష చేశారు. అవార్డులు గెలుచుకున్న వారికి రూ.లక్ష రివార్డు, జిల్లా స్థాయి అవార్డులకు రూ.25 వేల వరకు ప్రోత్సాహం ఇస్తామని చెప్పారు. జిల్లా నుంచి అధిక సంఖ్యలో అవార్డులను సాధించాలని కలెక్టర్ స్పష్టం చేశారు.

Similar News

News September 3, 2025

నిమజ్జనాల్లో డీజేలకు అనుమతులు లేవు: SP

image

శ్రీకాకుళం జిల్లాలో వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన గణేశ్ విగ్రహాల నిమర్జన వేడుకల్లో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని అధికారులను ఎస్పీ మహేశ్వర రెడ్డి ఆదేశించారు. నిమజ్జనానికి వెళ్లే మార్గంలో వాహనాల రాకపోకలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఉత్సవాలు, నిమజ్జన ఊరేగింపుల్లో డీజేలను వినియోగించేందుకు అనుమతులు లేవన్నారు.

News September 3, 2025

చింతపండుకి గిట్టుబాటు ధర లేక నష్టపోతున్న గిరిజనులు

image

శ్రీకాకుళంలోని ఏజెన్సీ ప్రాంతాలలో చింతపండు సేకరించే గిరిజనులు ఈ ఏడాది గిట్టుబాటు ధర లేక నష్టాల ఊబిలో కొట్టుమిట్టాడుతున్నారు. గిరిజన కార్పొరేషన్ నుంచి గిట్టుబాటు ధర లభించక దళారీల దోపిడీకి గురవుతున్నారు. ఈ ఏడాది ఏజెన్సీలో మంచు ఎక్కువగా కురవటంతో చింతపండు ఉత్పత్తి గణనీయంగా పడిపోయింది. దీనికి తోడు గిట్టుబాటు ధర చెల్లించకపోవటంతో దళారీలకే చింతపండు తక్కువ ధరకు ఇచ్చేస్తున్నామని గిరిజనులు వాపోతున్నారు.

News September 3, 2025

అరసవిల్లి సూర్య దేవాలయం మూసివేత

image

అరసవిల్లి ఆదిత్య ఆలయాన్ని ఈ నెల 7న భాద్రపద పౌర్ణమి చంద్ర గ్రహణం సందర్భంగా మూసివేయనున్నట్లు ఆలయ ఈవో ప్రసాద్, ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం నుంచి సోమవారం ఉదయం వరకు ఆలయాన్ని మూసివేస్తున్నామన్నారు. మరుసటి రోజు ఉదయం ఆలయ సంప్రోక్షణ అనంతరం స్వామి దర్శనానికి భక్తులను అనుమతిస్తామన్నారు.