News September 2, 2025
ఎమ్మార్పీ కన్నా ఎక్కువ ధరకు యూరియా అమ్మితే కఠిన చర్యలు: కలెక్టర్

ఎమ్మార్పీ ధర కన్నా యూరియా అధిక ధరకు అమ్మితే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ స్వప్న దినకర్ పుండ్కర్ హెచ్చరించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఎక్కడ యూరియా కొరత రాకూడదని ఆదేశించారు. కృత్రిమ కొరత నివారించేందుకు అగ్రికల్చరల్ కోపరేటివ్, పోలీస్, రెవెన్యూ అధికారులతో టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
Similar News
News September 4, 2025
శ్రీకాకుళం మీదుగా చర్లపల్లికి ప్రత్యేక రైళ్లు

దసరా, దీపావళి సందర్భంగా శ్రీకాకుళం జిల్లా మీదుగా చర్లపల్లి(CHZ), బ్రహ్మపుర(BAM) మధ్య స్పెషల్ రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. నం:07028 BAM- CHZ రైలును SET 6 నుంచి NOV 29 వరకు ప్రతి శనివారం నడుస్తాయన్నారు. నం:07027 CHZ- BAM రైలును SEPT 5 నుంచి NOV 28 వరకు ప్రతి శుక్రవారం నడుపుతామన్నారు. కాగా ఈ రైళ్లు జిల్లాలో శ్రీకాకుళం రోడ్, నౌపాడ, పలాస, సోంపేట, ఇచ్చాపురంలో ఆగుతాయన్నారు.
News September 4, 2025
శ్రీకాకుళం: 14 బార్లకు దరఖాస్తుల ఆహ్వానం

జిల్లాలో 14 బార్ల లైసెన్స్‌కు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ప్రొహిబిషన్ ఎక్సైజ్ అధికారి సీహెచ్ తిరుపతినాయుడు బుధవారం తెలిపారు. శ్రీకాకుళంలో 8, పలాస 2, ఆముదాలవలస 2, ఇచ్చాపురం 2 బార్లు కేటాయించారన్నారు. ఆసక్తి ఉన్నవారు ఈనెల 14 లోపు ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. 15న లాటరీ ద్వారా ఎంపిక చేస్తామన్నారు.
News September 4, 2025
ఆమదాలవలస: ఈనెల 10న మెగా జాబ్ మేళా

ఆమదాలవలసలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద ఈనెల 10న మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. బుధవారం ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ క్యాంపు కార్యాలయ సిబ్బంది వివరాలు వెల్లడించారు. ఈ మేళాలో 12 ప్రముఖ కంపెనీలు పాల్గొంటున్నట్లు తెలిపారు. 10వ తరగతి ఆపై చదివినవారు అర్హులన్నారు. ఆసక్తి ఉన్న నిరుద్యోగ యువత జాబ్ మేళాలో పాల్గొని ఉద్యోగాలు పొందాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.