News September 2, 2025

దేవాలయాల స్వయంప్రతిపత్తికి సహకరించండి: VHP

image

ఆంధ్రప్రదేశ్‌లోని హిందూ దేవాలయాల స్వయంప్రతిపత్తి కోసం కొత్త చట్టాన్ని తీసుకురావాలని కోరుతూ విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ) ప్రతినిధులు మంగళవారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పి.వి.ఎన్. మాధవ్‌ను కలిశారు. ఈ మేరకు ఒక నమూనా డ్రాఫ్ట్‌ను, ‘హైందవ శంఖారావం’ సభలో చేసిన తీర్మానాల ఆల్బమ్‌ను ఆయనకు అందజేశారు. దీనిపై సానుకూలంగా స్పందించి, త్వరలోనే చర్యలు తీసుకుంటామని మాధవ్ హామీ ఇచ్చారని వీహెచ్‌పీ నేతలు తెలిపారు.

Similar News

News September 3, 2025

రూ.కోటి విరాళం ప్ర‌క‌టించిన మంత్రి టీజీ భ‌ర‌త్

image

అమ‌ర‌జీవి పొట్టి శ్రీరాములు విగ్ర‌హ నిర్మాణానికి టీజీవీ సంస్థ‌ల త‌రఫున‌ రూ.కోటి విరాళం ఇస్తున్న‌ట్లు మంత్రి టీజీ భ‌ర‌త్ ప్ర‌క‌టించారు. అమ‌రావ‌తిలో ఏపీ ప్ర‌భుత్వం, పొట్టి శ్రీరాములు మెమోరియ‌ల్ ట్ర‌స్ట్‌ సంయుక్తంగా 58 అడుగుల కాంస్య విగ్ర‌హంతో పాటు ఆడిటోరియం, స్మృతివనం ఏర్పాటు చేయ‌నున్నాయి. వీటి నిర్మాణానికి శంకుస్థాప‌న చేసిన అనంత‌రం మంత్రి భ‌ర‌త్ ఈ విరాళం ప్ర‌క‌టించారు.

News September 3, 2025

చచ్చిన పామును మళ్లీ చంపాల్సిన అవసరం లేదు: CM రేవంత్

image

TG: BRS అనే పాములో కాలకూట విషం ఉందని CM రేవంత్ ధ్వజమెత్తారు. ‘రూ.లక్ష కోట్లు దోచుకున్న వ్యక్తి ఇంట్లో కలహాలు మొదలయ్యాయి. పంపకాల్లో తేడాలొచ్చి కొట్టుకుంటున్నారు. దోపిడీ సొమ్ము ఆ కుటుంబంలో చిచ్చు పెట్టింది. వాళ్లలో వాళ్లు కొట్టుకుంటూ మాపై నిందలు వేస్తున్నారు. మంత్రగాడి దగ్గరికి వెళ్లి మీ పంచాయితీ తేల్చుకోండి. BRSను ప్రజలే బొందపెట్టారు. చచ్చిన పామును మళ్లీ చంపాల్సిన అవసరం మాకేముంది’ అని అన్నారు.

News September 3, 2025

రాజమండ్రి: ‘3.30 లక్షల ఇళ్లకు కుళాయి కనెక్షన్లు’

image

తూ.గో జిల్లాలో జల్ జీవన్ మిషన్ పథకం కింద ఇప్పటివరకు 3,30,000 ఇళ్లకు కుళాయి కనెక్షన్లు ఇవ్వడం జరిగిందని కలెక్టర్ పి.ప్రశాంతి బుధవారం తెలిపారు. బుధవారం కేంద్ర జల్ జీవన్ మిషన్ అదనపు జాయింట్ సెక్రటరీ సి.కమల్ కిషోర్ న్యూ ఢిల్లీ నుంచి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష జరిపారు. జిల్లాలో దాదాపు 92 శాతం గృహాల వివరాలను ఐఎమ్‌ఐఎస్ వెబ్‌సైట్‌లో అప్లోడ్ చేశామని కలెక్టర్ వివరించారు.