News September 3, 2025

KNR: ప్రభుత్వ భూములు పరిరక్షించాలి: కలెక్టర్

image

KNR రూరల్ మండలం బొమ్మకల్ పరిధిలోని 728 సర్వే నంబర్‌లోని ప్రభుత్వ భూమిని పరిశీలించారు. ఈ భూమికి పక్కాగా హద్దులు నిర్ణయించాలని, ఆక్రమణలకు గురి కాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వ భూముల్లోని అనధికార కట్టడాలను తొలగించాలన్నారు. ప్రభుత్వ భూములను గుర్తించి పక్కాగా హద్దులు నిర్ణయించాలని, రాతి కడీలు, సూచిక బోర్డులు చేసి ఆక్రమణకు గురి కాకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు.

Similar News

News September 3, 2025

KNR: ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో జాతీయ పోషకాహార వారోత్సవాలు

image

ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో జాతీయ పోషకాహార వారోత్సవాలు-2025 ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పోస్టర్ ప్రదర్శనలు, వ్యాసరచన, ప్రశ్నోత్తర పోటీలు నిర్వహించగా, విద్యార్థులు చురుకుగా పాల్గొన్నారు. “ఆరోగ్యమే మహాభాగ్యం, సరైన ఆహారమే ఆరోగ్యానికి మూలం” అని అధ్యాపకులు విద్యార్థులకు సూచించారు. కళాశాల ప్రిన్సిపల్ డి.వరలక్ష్మి, పోషకాహార విభాగాధిపతి డా. విద్య, జీవ విజ్ఞానశాఖాధిపతి డా.మనోజ్ ఉన్నారు.

News September 3, 2025

KNR: ‘పాఠశాల విద్యలో జిల్లా ఆదర్శంగా నిలవాలి’

image

పాఠశాల విద్యా శాఖ ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో ముందుస్తుగా ఉపాధ్యాయ దినోత్సవం వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ.. పాఠశాల విద్యలో రాష్ట్రంలో కరీంనగర్ జిల్లాను ఆదర్శంగా నిలువాలని పేర్కొన్నారు. విద్యా రంగంలో ఉపాధ్యాయుల సేవలు వెల కట్టలేనివని, విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని కోరారు.

News September 3, 2025

KNR: రేపటి నుంచి వైన్స్ బంద్

image

వినాయక నిమజ్జనం నేపథ్యంలో జిల్లాలో ఈ నెల 4వ తేదీ(రేపు) ఉదయం 6 గంటల నుంచి 6వ తేదీ ఉదయం 6 గంటల వరకు మద్యం షాపులు మూసివేయాలని జిల్లా ప్రోహిబిషన్, ఎక్సైజ్ అధికారి పి.శ్రీనివాస్ రావు ఒక ప్రకటనలో తెలిపారు. మద్యం A4 దుకాణాలు, 2B బార్లు, CI క్లబ్స్, కల్లు దుకాణాలు/డిపోలు, మిలిటరీ క్యాంటీన్ & టి.ఎస్.బి.సి.ఎల్ KNR డిపో మూసివేయాలని అదేశించారు. నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకోబడతాయని పేర్కొన్నారు.