News September 3, 2025

జమ్మికుంట: రైలు నుండి పడి వ్యక్తి మృతి

image

పెద్దపల్లి(D) పాలకుర్తి మం. కుక్కలగూడూర్ గ్రామానికి చెందిన సంగెం నరేష్‌(33) రైలు నుంచి కిందపడి మృతి చెందాడు. బిజిగిరి షరీఫ్ దర్గా దర్శనానికి వెళ్లి తిరుగు ప్రయాణంలో JMKT-బిజిగిరి షరీఫ్ స్టేషన్ల మధ్య ఫ్లైఓవర్ సమీపంలో ఈ ఘటన జరిగింది. మృతుడి ఫోన్ ఆధారంగా కుటుంబానికి సమాచారం అందించారు. శవాన్ని జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News September 4, 2025

KMR: సీఎం పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు: SP

image

CM రేవంత్ రెడ్డి గురువారం కామారెడ్డి జిల్లా పర్యటన సందర్భంగా గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు KMR ఎస్పీ రాజేశ్ చంద్ర తెలిపారు. షెడ్యూల్ ప్రకారం CM పర్యటన సాఫీగా సాగేలా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. వరద నష్టంపై కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ అధ్యక్షతన నిర్వహించిన సమీక్ష పాల్గొన్న SP సీఎం పర్యటన సందర్భంగా చేపట్టాల్సిన భద్రతా చర్యలను వివరించారు.

News September 4, 2025

MHBD: విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలి: కలెక్టర్

image

విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అన్నారు. ఆయన గుమ్మడూరు గురుకుల బాలుర పాఠశాలను తనిఖీ చేసి, వంటగదులను పరిశీలించారు. షెడ్యూల్ ప్రకారం సిలబస్‌ను పూర్తి చేయాలని, విద్యార్థుల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

News September 4, 2025

NZSR: 14 నుంచి 9 గేట్లకు తగ్గింపు

image

నిజాంసాగర్ ప్రాజెక్టులోకి వరద ప్రవాహం కొనసాగుతోంది. బుధవారం సాయంత్రం 9 గంటల సమయానికి ప్రాజెక్టులోకి 73,085 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. మధ్యాహ్నం వరకు 14 గేట్ల ద్వారా వరద నీటిని దిగువకు విడుదల చేయగా, ఇన్‌ఫ్లో తగ్గడంతో అధికారులు ఐదు గేట్లను మూసివేశారు. ప్రస్తుతం 9 గేట్ల ద్వారా 49,113 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రధాన కాలువ ద్వారా 1,000 క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది.