News September 3, 2025

జిల్లాలో అవసరానికి తగిన యూరియా సరఫరా: కలెక్టర్

image

జిల్లాలో ఖరీఫ్-2025 సీజన్‌కు అవసరమైన ఎరువుల సరఫరా సమయానుకూలంగా సరఫరా చేస్తున్నట్లు కలెక్టర్ పి.ప్రశాంతి మంగళవారం తెలిపారు. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్‌ వరకు జిల్లాకు అవసరమైన 26,000 మెట్రిక్ టన్నుల యూరియాలో ఇప్పటివరకు 22,000 మెట్రిక్ టన్నులు సరఫరా చేసినట్లు వివరించారు. దుకాణదారులు యూరియా, ఎరువులను అధిక ధరకు విక్రయించినా, ఇతర ప్రాంతాలకు తరలించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Similar News

News September 4, 2025

రాజమండ్రి: గోదావరి పుష్కరాలకు ముందస్తుగా కర్టైన్ రైజర్ ప్రోగ్రామ్

image

గోదావరి పుష్కరాలకు సంబంధించి ముందస్తుగా కర్టైన్ రైజర్ కార్యక్రమం నిర్వహిద్దామని మంత్రి కందుల దుర్గేష్ సూచించగా ముఖ్యమంత్రి చంద్రబాబు అంగీకరించారు. పర్యాటక శాఖపై బుధవారం సీఎం నిర్వహించిన సమీక్షలో వర్చువల్‌గా మంత్రి దుర్గేశ్ పాల్గొన్నారు. అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టు క్రింద చేపట్టిన హేవలాక్ బ్రిడ్జిని త్వరితగతిన  పర్యాటకులకు అందుబాటులోకి తెస్తామని దుర్గేశ్ తెలిపారు.

News September 3, 2025

రాజమండ్రి టీచర్‌కు రాష్ట్ర స్థాయి అవార్డు

image

రాజమండ్రి లాలాచెరువు హైస్కూల్ ఉపాధ్యాయురాలు మోటూరి మంగారాణి రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకి ఎంపికయ్యారు. వృత్తిపట్ల అంకితభావం, నూతన టెక్నాలజీతో బోధన చేయడంలో ఆమె ఎప్పుడూ ముందుంటారు. టీచర్లకు అవసరమైన ఎన్నో చక్కటి వీడియోలు రూపొందిస్తారు. నిత్య విద్యార్థిగా ఉంటూ ఎన్నో విషయాలు నేర్చుకుంటూ రాష్ట్రస్థాయి రిసోర్స్ పర్సన్‌గా రాణిస్తున్నారు. సెప్టెంబర్ 5న సీఎం చంద్రబాబు చేతుల మీదుగా అవార్డు అందుకోనున్నారు.

News September 3, 2025

రాజమండ్రి: ‘3.30 లక్షల ఇళ్లకు కుళాయి కనెక్షన్లు’

image

తూ.గో జిల్లాలో జల్ జీవన్ మిషన్ పథకం కింద ఇప్పటివరకు 3,30,000 ఇళ్లకు కుళాయి కనెక్షన్లు ఇవ్వడం జరిగిందని కలెక్టర్ పి.ప్రశాంతి బుధవారం తెలిపారు. బుధవారం కేంద్ర జల్ జీవన్ మిషన్ అదనపు జాయింట్ సెక్రటరీ సి.కమల్ కిషోర్ న్యూ ఢిల్లీ నుంచి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష జరిపారు. జిల్లాలో దాదాపు 92 శాతం గృహాల వివరాలను ఐఎమ్‌ఐఎస్ వెబ్‌సైట్‌లో అప్లోడ్ చేశామని కలెక్టర్ వివరించారు.